ఆ దెబ్బతో NBK 109 యూనిట్ ఆలోచనల్లో పడిందా..?

Pulgam Srinivas
నందమూరి బాలకృష్ణ ఆఖరుగా భగవంత్ కేసరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీ లీల ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించగా ... ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు. ఇకపోతే పోయిన సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం బాలకృష్ణ , బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ మూవీ NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణను జరుపుకుంటుంది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన రెండు గ్లిమ్స్ వీడియోలను ఈ మూవీ బృందం విడుదల చేసింది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా యొక్క టైటిల్ ను గాని , ఈ మూవీ విడుదల తేదీని కానీ మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఇకపోతే ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో విడుదల చేయబోతున్నారు అని ఒక వార్త , కాదు ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయబోతున్నారు అని మరో వార్త , అలాగే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు మరో వార్త వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే ఇటు చూస్తే ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో చాలా సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. అలాగే డిసెంబర్ నెలలో అత్యంత క్రేజ్ కలిగిన పుష్ప మూవీ విడుదల కాబోతోంది. అలాగే గేమ్ చేంజర్ మూవీ ని కూడా ఇదే నెలలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక వచ్చే సంవత్సరం జనవరి నెలలో కూడా కాంపిటీషన్ బాగా ఉంది. మరి కాంపిటేషన్ ఉన్న సై అని బాలయ్య బరిలోకి దూకుతాడావ్ ... లేక కొత్త విడుదల తేదీలను చూసుకుంటాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

nbk

సంబంధిత వార్తలు: