SSMB29: బాప్ ఆఫ్ ఇండియన్ సినిమాస్ అవ్వడం పక్కా?

Purushottham Vinay
టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాతో  అభిమానులని తన డాన్స్, లుక్స్, మాస్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా ప్లాప్ టాక్ తోనే ఏకంగా 250 కోట్లదాకా వసూళ్ళని రాబట్టింది. దాంతో ఇప్పుడు మహేష్ నెక్స్ట్ మూవీపై అంచనాలు చాలా భారీగా పెరిగిపోయాయి. టాప్ దర్శకుడు రాజమౌళితో మహేష్ బాబు చేస్తున్నాడు. మహేష్ బాబు, రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.ఇంకా అలాగే ఈ టైటిల్‌పై అందరిలో కూడా ఆసక్తి నెలకొంది.ఈ సినిమా టైటిల్ గురించి ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.రాజమౌళి ప్రతి సినిమాకి పర్ఫెక్షన్ కోసం చాలా సమయం కేటాయిస్తుంటారు. మహేష్ బాబుతో సినిమా అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే రాజమౌళి ఫస్ట్ టైం ఒక టాప్ హీరోతో సినిమా చేయబోతున్నాడు.

రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ప్రస్తుతం స్టార్ హీరోలైనా రాజమౌళి వారితో ఫస్ట్ టైం సినిమా చేసినప్పుడు వారు చిన్న హీరోలే. కానీ మహేష్ మాత్రం 3 ఇండస్ట్రీ హిట్లు కొట్టిన బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న టాప్ హీరో. అటువంటి హీరోతో మూవీ అంటే రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా టైటిల్ రివీల్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అప్పుడు కూడా ఎలాంటి అప్డేట్ రాదు అని తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి 'గోల్డ్‌' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి.ఈ మూవీ ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని ఇప్పటికే విజయంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చారు. ఇండియానా జోన్స్ తరహాలో ఈ మూవీ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. కారడవుల్లో బంగారం కోసం జరిగే వేట నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని అంటున్నారు. అలాగే ఈ అడవుల్లో మహేష్ చేసే సాహసాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయట. రామ్ గోపాల్ వర్మ చెప్పినట్లు ఈ సినిమా కచ్చితంగా బాప్ ఆఫ్ ఆల్ ఇండియన్ సినిమాస్ అవుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: