ఆ పని చేయాలనేది నయనతార డ్రీమ్.. కానీ సినిమాల్లోకి ఎందుకు వచ్చిందంటే..?

Pandrala Sravanthi
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కి హీరోయిన్ కాదు అలా అవ్వాలనే డ్రీమ్ ఉండేదట. కానీ అదృష్టం కొద్ది సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు వచ్చి పెద్ద స్టార్ అయిపోయింది. ఒకవేళ సినిమాల్లో అవకాశాలు రాకపోతే మాత్రం ఆ పని చేసేదాన్ని అని తాజా ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని కేరళ బ్యూటీ నయనతార స్పష్టం చేసింది. నయనతార తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. నాకు సినిమాల పై ఇంట్రెస్ట్ లేక ముందు చార్టెడ్ అకౌంటెంట్ కావాలి అనుకున్నాను. అయితే నేను ఇంగ్లీష్ లిటరేచర్ లో బీ ఏ చేశాను. అలా సినిమాల్లోకి రాకపోతే కచ్చితంగా చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేసేదాన్ని.అదే నా డ్రీమ్.. 

ఇక నేను సినిమాల్లోకి అనుకోకుండా వచ్చాను .మా నాన్న ఓ పెద్ద యాడ్ ఏజెన్సీ లో వర్క్ చేసేవారు. అలా అప్పుడప్పుడు నా ఫోటోలు ఆ యాడ్ ఏజెన్సీ వారికి చూపించేవాడు. అలా ఓ మలయాళ డైరెక్టర్ నన్ను హీరోయిన్ గా ఎంపిక చేసి సినిమాలోకి హీరోయిన్ గా ఇండస్ట్రీ కి తీసుకువచ్చారు. ఇక నేను డిగ్రీ చదివే సమయం లోనే శరత్ కుమార్,  మోహన్ లాల్ వంటి హీరోలతో నటించాను అంటూ నయనతార చెప్పుకొచ్చింది. ఇదే ఇంటర్వ్యూ లో నయనతార మాట్లాడుతూ.. నా కెరియర్ ని రజినీకాంత్ హీరోగా చేసిన చంద్రముఖి మార్చేసిందని, ఈ సినిమానే నా కెరియర్ కి టర్నింగ్ పాయింట్ అంటూ చెప్పింది.

అంతేకాకుండా టాలీవుడ్ లో వెంకటేష్ హీరోగా చేసిన లక్ష్మీ మూవీ తో నేను తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాను. ఈ సినిమా కూడా నాకు మంచి గుర్తింపును ఇచ్చింది. అలా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రాణించాను అంటూ నయనతార గుర్తు చేసుకుంది. ఇక నయనతార పెళ్లయినా కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోయిన్ల కు అందంతో పోటీ ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: