పవన్ ఇక కొత్త సినిమాలు చేయడా?

Suma Kallamadi
తెలుగు సినిమా పరిశ్రమ ఇలవేలుపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఇక్కడ ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. ఆయన సినిమా విడుదల గురించి తెలుగు సినిమా ప్రేక్షకులు పడిగాపులు కాస్తూ ఉంటారు. ఇక ఆయన హ్యుమానిటీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన క్యారెక్టర్ కి ఎంత మంది అభిమానులు ఉన్నారో లెక్క కట్టడం చాలా కష్టం. అందుకే అంటారు కొంతమంది విశ్లేషకులు... పవన్ కి ఫ్యాన్స్ ఉండరు.. కేవలం భక్తులు మాత్రమే ఉంటారని.
మరి అలాంటి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ సినిమాలు చేయకపోతే ఊరుకుంటారా? అనేది చెప్పడం మాత్రం చాలా కష్టం. ప్రస్తుతం రాజకీయ జీవితంలో బిజీగా గడుపుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో మొదలుపెట్టిన ఓ రెండు మూడు సినిమాలు తప్పితే... ఇక రాబోయే రోజుల్లో సినిమాలు చేయడం కష్టమేనని గుసగుసలు వినబడుతున్నాయి. ఇదే మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పవర్ స్టార్ అభిమానులు నొచ్చుకుంటున్నారు. తమ హీరో రెండేళ్లకు ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకుంటున్నారు.
అయితే ఇప్పుడున్న పరిస్థితులలో పవన్ కళ్యాణ్ పెండింగ్ లో ఉన్న సినిమాలను చేయడమే చాలా కష్టంగా మారింది. ఆయా సినిమా నిర్మాతలు, దర్శకులు పవన్ కళ్యాణ్ సెట్స్ లోకి ఎప్పుడెప్పుడు అడుగు పెడతాడా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలు పూర్తి చేస్తే... పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు చేసినట్లే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలోనే అభిమానులకు ఓ చక్కటి శుభవార్త అందించింది ఓజి టీం. దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తి కాగా... నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో స్టార్ట్ అవ్వబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దాదాపు 250 కోట్ల రూపాయలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై చాలా గట్టిగానే అంచనాలు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: