కీర్తిసురేష్ పెళ్లి కుదిరింది.. పెళ్లి కొడుకు ఎవ‌రో చెప్పేసింది..?

Pandrala Sravanthi
మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ తెలుగు, కన్నడ, తమిళ సినిమాలతో పాటు హిందీ సినిమాల్లో కూడా రాణిస్తుంది.అలా అటు నార్త్ ఇటు సౌత్ రెండింట్లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవాలని చూస్తోంది.ఇక సౌత్లో ఈమె చేసిన సినిమాలు హిట్ అవ్వడంతో స్టార్ స్టేటస్ వచ్చింది  ఇగ మిగిలింది బాలీవుడ్ లోనే. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తెలుగులో మహానటి,నేను శైలజ ,దసరా,సర్కారు వారి పాట వంటి ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఇమేజ్ సంపాదించింది. ఇక బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ వరుణ్ ధావన్ తో ఓ సినిమా చేస్తోంది.అయితే అలాంటి కీర్తి సురేష్ తన స్నేహితుడిని నిజంగానే పెళ్లి చేసుకోబోతుందా .. కీర్తి సురేష్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందా? ఇంతకీ వైరల్ అవుతున్న న్యూస్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం..

 కీర్తి సురేష్ పెళ్ళంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి.హీరోతో పెళ్ళంటూ..బిజినెస్ మాన్ తో పెళ్ళంటూ.. ఫ్యామిలీ ఫ్రెండ్ తో పెళ్ళంటూ..ఇలా ఎన్నోసార్లు ఈమె పెళ్లి వార్తలు మీడియాలో హైలెట్గా నిలిచాయి. అయితే ఈ పెళ్లి వార్తలపై చాలాసార్లు కీర్తి సురేష్ తల్లి తండ్రి  క్లారిటీ ఇచ్చారు.ఒకవేళ కీర్తి పెళ్లి చేసుకుంటే ఆ విషయం కచ్చితంగా అభిమానులకు ముందుగానే తెలియజేస్తుంది అని కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు.అయినప్పటికీ కీర్తి సురేష్ పెళ్లి వార్తలు మాత్రం ఆగడం లేదు. అయితే తాజాగా కీర్తి సురేష్ నటించిన రఘు తాత మూవీ ఆగస్టు 15న విడుదలకు సిద్ధంగా ఉంది.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అభిమానులతో ముచ్చటించిన కీర్తి సురేష్ తన పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

కొంతమంది అభిమానులు మీరు మీ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.అది నిజమేనా అని అడగగా..ఇలాంటి వార్తలపై నేను అస్సలు స్పందించను.ఎందుకంటే ఇలాంటి రూమర్స్ పై స్పందిస్తే అది నిజమే అనుకుంటారు. అందుకే వీటిని అంతగా పట్టించుకోను. ఇక నా సినిమాలపై,నటనను ఎవరైనా విమర్శిస్తే మాత్రం దాన్ని తప్పకుండా స్వీకరించి ఆ తర్వాత నటించే సినిమాల్లో ఎలా చేయాలి అనేది గుర్తుపెట్టుకుంటాను.కానీ నా పర్సనల్ లైఫ్ పై,కుటుంబంపై ఎవరైనా ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తే అస్సలు స్పందించను. వాటిని వదిలేస్తాను అంటూ కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చింది. ఇక కీర్తి సురేష్ మాటల్ని బట్టి చూస్తే మాత్రం ఆమె ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా లేదు. ఎందుకంటే ఆమె చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది కాబట్టి పెళ్లికి ఇంకోద్ది రోజులు సమయం ఉన్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: