నాగ్ అశ్విన్ : కల్కి సినిమాలో ఆ సీన్స్ కోసం ఎన్నో ఏళ్లగా ఎదురుచూసా..!!

murali krishna
ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్లతో నాగ్ అశ్విన్ తీసిన కల్కి 2898 ఏడీ మూవీ ఇప్పుడు రికార్డులు క్రియేట్ చేస్తోంది. మొదటి వారంలోనే దాదాపు ఏడు వందల కోట్లకు పైగా రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. వెయ్యి కోట్లకు ఈ చిత్రం పరుగులు పెడుతోంది. రెండో వారాంతానికి మంచి కలెక్షన్లు వచ్చేలా ఉన్నాయి. సినిమా మంచి స్పీడు మీదుండటంతో దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియా ముందుకు వచ్చాడు. కల్కి గురించి ఎన్నో విషయాలను పంచుకున్నాడు.''కల్కి' స్కిప్ట్‌ రాయడానికి చాలా సమయం పట్టింది. ముఖ్యంగా నటీనటుల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా. బహుశా మేము ఇప్పటివరకు చేసిన సినిమాల్లో వీఎఫ్‌ఎక్స్‌కు అత్యంత ప్రాధ్యాన్యం ఉన్న చిత్రమిదే. దీనికోసం నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. 'కల్కి' క్లైమాక్స్‌ను చిత్రీకరించడం అన్నిటికంటే పెద్ద సవాలుగా అనిపించింది. వందల మంది ఆర్టిస్టులు కావాలి. క్లిష్టమైన వీఎఫ్ఎక్స్‌ ఎఫెక్ట్‌లు అవసరం. ప్రతి దాన్ని మా సొంతంగా డిజైన్‌ చేసుకున్నాం. చిత్రంలోని అగ్ర నటీనటుల పాత్రలన్నిటికీ ప్రాధ్యాన్యం ఉండేలా చూశాం. మహాభారతంలో ఎంతో కీలకమైన అశ్వత్థామ పాత్రకు అమితాబ్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేదు. దేశంలోని పెద్ద స్టార్‌లలో ఆయన ఒకరు. ఆయన మాత్రమే ఈ పాత్రను మరింత శక్తిమంతంగా చేయగలరనిపించింది. అమితాబ్‌, ప్రభాస్‌ల మధ్య పోరాట సన్నివేశాలు తీయాలనేది నా కల. వాళ్లు ఈ చిత్రాన్ని అంగీకరించగానే ఎంతో ఆనందించా' అని చెప్పారు.ఇక విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'కల్కి' ఇప్పటివరకు ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లు వసూళ్లను సాధించింది. ఇతిహాసాలతో కూడిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచింది.ముందునుంచీ భైరవగా సందడి చేసిన ప్రభాస్‌.. చివరిలో కర్ణుడిగా కనిపించి 'పార్ట్‌ 2'పై అంచనాలు పెంచేశారు.'కల్కి 2898 ఏడీ' సినిమా గత బుధవారంతో 28 రోజులు పూర్తి చేసుకుంది. ఈ మొత్తం రోజుల్లో కూడా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల కలెక్షన్లతో కలుపుకుని కోటి రూపాయల కంటే ఎక్కువగానే షేర్‌ను వసూలు చేసింది. తద్వారా ఈ ఘనతను సాధించిన తొలి భారతీయ సినిమాగా ఇది రికార్డును సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: