తంగలాన్: ఇలా అయితే విక్రంకి హిట్టు కష్టమే?

Purushottham Vinay

ఒకప్పుడు తమిళ స్టార్ హీరో విక్రం వరుస హిట్లతో కోలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోయేవాడు. తెలుగులో కూడా మంచి మార్కెట్ సంపాదించాడు. ఆయన సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది అంటే ఆ సినిమాపై అంచనాలు.. ప్రాజెక్ట్ పై బిజినెస్ కూడా భారీగా ఉండేది. కానీ విక్రం ఈమధ్య పూర్తిగా ఫాం కోల్పోయే సరికి బిజినెస్ విషయం ఏమో గాని అసలు సినిమాపై బజ్ ఏమాత్రం రావట్లేదు.విక్రం మాత్రం తన ప్రతి సినిమాను తమిళ ఆడియన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ కు కూడా అందించాలని అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ప్రమోషన్స్ విషయంలో మాత్రం ఏమాత్రం దృష్టి పెట్టట్లేదు. సినిమాకు ముందే ఏదో ఒక ఈవెంట్, రెండు రోజులు ఇంటర్వ్యూస్ ఇస్తే సరిపోతుందని విక్రమ్ అనుకుంటున్నాడు.విక్రం సినిమాలు కోలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా ఈమధ్య ఎంతగానో నిరాశ పరిచాయి. తెలుగు, తమిళ్ లో పూర్తిగా వెనకబడ్డాడు విక్రం. ఐతే మళ్లీ తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు ఈసారి తంగలాన్ అనే మరో వైవిధ్యమైన సినిమాతో ముందుకి వస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ పా రంజిత్ డైరెక్షన్ లో డిఫరెంట్ కథాంశంతో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా ట్రైలర్ కనుక చూస్తే విక్రం ఎప్పటిలాగే తన బెస్ట్ ఇచ్చేశాడని అనిపిస్తుంది.


ప్రతి సినిమాకి విక్రమ్ ఇలానే కష్టపడుతూ ఉంటాడు. ప్రతి సినిమాలో కూడా తను రకరకాల వేషధారణతో ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్న విక్రం ప్రయత్నాలన్నీ గత కొంతకాలం నుంచి అసలు వర్క్ అవుట్ అవ్వట్లేదు. అసలు సరైన కథ లేకుండా ఎలాంటి ప్రయోగాలు చేసినా కానీ  ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరు. ఐతే ఈసారి పా రంజిత్ తో ఒక పర్ఫెక్ట్ స్టోరీ టెల్లింగ్ తోనే తంగలాన్ సినిమాని తీస్తున్నారని తెలుస్తుంది. ఐతే ఈ మూవీ ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ ఫిక్స్ చేయగా ఇప్పటి దాకా తెలుగులో ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ మొదలు పెట్టలేదు.ఆల్రెడీ ఆరోజే రామ్ డబుల్ ఇస్మార్ట్ తో పాటుగా రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. పైగా ఈ రెండు మాస్ సినిమాలే అవ్వడంతో వీటికి పోటీగా వచ్చే తంగలాన్ సినిమాని ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తే తప్ప ఆడియన్స్ దృష్టిలోకి వెళ్లే ఛాన్స్ లేదు. మరి తంగలాన్ సినిమా మేకర్స్ ఆలోచన ఎలా ఉందో కానీ విక్రం తెలుగు ఫ్యాన్స్ మాత్రం సినిమా ప్రమోషన్స్ చేయలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. తంగలాన్ మూవీతో భారీ టార్గెట్ పెట్టుకున్న విక్రం అందుకు తగిన కంటెంట్ తోనే వస్తున్నాడా లేదా అన్నది రిలీజ్ రోజు కచ్చితంగా తెలుస్తుంది. విక్రం తంగలాన్ సినిమాలో మలయాళ స్టార్ హీరోయిన్ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించగా పార్వతి తిరువొతు ఇంపార్టెంట్ రోల్ లో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: