అద్వానంగా మారిన పవన్ సినిమాల పరిస్థితి.. ఆ మూవీస్ షెడ్డుకెళ్ళినట్లేనా?

Purushottham Vinay

ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మంత్రిగా పరిపాలన వ్యవహారాలలో చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు తెలియజేశారు.అయితే సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ ప్రయాణం ఎలా ఉంటుందనేది ఇప్పుడు నిర్మాతలకు ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిపాలన వ్యవహారాలలో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడం వలన మరో మూడు నెలల దాకా సినిమా షూటింగ్ లకి సమయం కేటాయించే అవకాశం లేదనే మాట చాలా బలంగా వినిపిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు చేయకూడదనే నిర్ణయానికి రాలేదు. ప్రస్తుతం ఆయన కమిట్ అయిన సినిమాలు మొత్తం మూడు ఉన్నాయి. ఇక ఈ మూడు సినిమాలు కూడా ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉండడం విశేషం. అయితే ఈ మూవీలని కచ్చితంగా పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ సినిమాల షూటింగ్ ల కోసం ఎక్కువ సమయం తీసుకుంటే నిర్మాతలకు కచ్చితంగా భారం అయ్యే అవకాశం ఉంది. అందుకే దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ రెండేళ్లలోనే మూడు సినిమాలు పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల షూటింగ్స్ ఆల్ మోస్ట్ చివరి దశలో ఉన్నాయి. వీటిలో ఏ సినిమా ముందు కంప్లీట్ చేస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 


తాజాగా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ముందుగా యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీ కంప్లీట్ చేసే అవకాశం ఉందంట. ఈ సినిమాని కచ్చితంగా పూర్తి చేస్తానని నిర్మాత దానయ్యకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పారట.ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు షూటింగ్ చేయడానికి డైరెక్టర్ సుజిత్ ఏర్పాట్లు చేసుకుని రెడీగా ఉన్నారని సమాచారం తెలుస్తుంది. ఈ మూవీ కోసం 25 రోజుల డేట్స్ పవన్ కళ్యాణ్ ఇస్తే సినిమా కంప్లీట్ అయిపోతుందని తెలుస్తోంది. ఇప్పటికే సినిమాలో మెజారిటీ పార్ట్ ని డైరెక్టర్ సుజిత్ ఫినిష్ చేశారు. కేవలం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సీక్వెన్స్ పెండింగ్ లో ఉన్నాయనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఓజీ మూవీ కోసం కాల్ షీట్స్ కేటాయించే అవకాశం ఉందని టాక్. ఈ మూవీ పూర్తి చేసిన తర్వాత మిగిలిన రెండు సినిమాల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చర్చ నడుస్తోంది. హరిహర వీరమల్లు మూవీ కోసం పవన్ కళ్యాణ్ 20 నుంచి 30 రోజుల డేట్స్ ఇస్తే షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం గతంలో చెప్పారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ మాత్రం వచ్చే ఏడాదిలో చేసే అవకాశం ఉందని ప్రస్తుతం ప్రచారం నడుస్తోంది. ఓజీ సినిమా కంప్లీట్ అయ్యాక తన రాజకీయ కార్యకలాపాలు చూసుకొని వీలును బట్టి హరిహర వీరమల్లు సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: