ఎన్టీఆర్ " దేవర " సాంగ్ అప్డేట్ ఇచ్చిన శేఖర్ మాస్టర్..!

lakhmi saranya
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరును సంపాదించుకున్నాడు. ఇప్పుడు రీసెంట్ గా దేవర మూవీ లో హీరో క్యారెక్టర్ లో చేస్తున్న సంగతి తెలిసింది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంభోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం దేవర. ఈ మూవీ రెండు పార్టులుగా రూపొందుతుంది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో తీర్చ దిద్దుతున్న ఈ సినిమా మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ మాస్టర్ 'దేవర' సాంగ్ కు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ..'దేవర' లో కంపోజ్ చెయబోయే పాట ఎలా ఉంటుందో చూసి చెప్పాలి. మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. డాన్స్ కు ప్రాధాన్యమున్న సాంగ్ ఇది. రెండు రోజులలో షూటింగ్ ప్రారంభం కానుంది "అని తెలిపారు.

అలాగే బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలోని పాటకు, విజయ్ హీరోగా రూపొందుతున్న ' ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ' లోని సాంగ్ కు కోరియోగ్రఫి చేశానని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు. కాగా ఎన్టీఆర్ సినిమాలోని 'బంతిపూల జానకి' 'లవ్ మీ అగైన్' 'అవి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ' వంటి హిట్ పాటలకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా..మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కావడంతో ఫాన్స్ లో ఆసక్తి నెలకొంది. ప్రేక్షకులు ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ఎదురుచూస్తున్నారు . ఈ సాంగ్ ఏ విధంగా ఉంటుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాంగ్ రిలీజ్ డేట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని కూడా వెయిట్ చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: