పాన్ ఇండియా మూవీలతో తమ సత్తా ఏంటో దేశం మొత్తం చాటిన తెలుగు దర్శకులు వీరే..?

MADDIBOINA AJAY KUMAR
ఇప్పటి వరకు మన తెలుగు దర్శకులు ఎంతో మంది పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించారు. అందులో కొంత మంది మాత్రమే పాన్ ఇండియా మూవీ లతో సక్సెస్ అయ్యి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నారు. అలా పాన్ ఇండియా మూవీలతో సక్సెస్ అయ్యి ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులు ఎవరు అనే విషయాలను తెలుసుకుందాం.
ఎస్ ఎస్ రాజమౌళి : ఈయన పాన్ ఇండియా సినిమాలకు దారులను వేశాడు. మొదటగా తెలుగు సినిమాలకు మార్కెట్ లేదు అనే సమయంలో రాజమౌళి ప్రభాస్ హీరోగా బాహుబలి అనే పాన్ ఇండియా మూవీ ని విడుదల చేశాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఇక ఆ తర్వాత బాహుబలి 2 సినిమా మరింత పెద్ద బ్లాక్ బాస్టర్ అయ్యింది. ఇక ఆ తర్వాత రాజమౌళి , రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ అనే మరో పాన్ ఇండియా మూవీ ని తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయం అందుకుంది. ఇలా ఇప్పటి వరకు ఈయన తీసిన మూడు పాన్ ఇండియా సినిమాలు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాలతో ఈయనకు దేశ వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగానే గుర్తింపు లభించింది.
సుకుమార్ : ఈ దర్శకుడు కేవలం ఇప్పటి వరకు పుష్ప పాటు 1 అనే పాన్ ఇండియా మూవీ కి మాత్రమే దర్శకత్వం వహించాడు. కానీ ఈ సినిమాతోనే ఈయనకు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ మూవీ లో అల్లు అర్జున్ హీరో గా నటించాడు. ప్రస్తుతం సుకుమార్ "పుష్ప పార్ట్ 2" మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని కూడా పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
సందీప్ రెడ్డి వంగ : ఈ దర్శకుడు కొంత కాలం క్రితం హిందీ నటుడు అయినటువంటి రన్బీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే పాన్ ఇండియా మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ దర్శకుడికి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది.
నాగ్ అశ్విన్ : ఈ దర్శకుడు తాజాగా ప్రభాస్ హీరోగా కల్కి 2898 AD అనే పాన్ ఇండియా మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ ఇప్పటికే 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ సినిమా ద్వారా నాగ్ అశ్విన్ కి దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: