ఆ మూవీలో బ్రహ్మానందం రోల్ ని కొట్టేసిన పృథ్వీరాజ్..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో 30 ఇయర్స్ పృథ్విరాజ్ ఒకరు. ఈయన ఖడ్గం సినిమాలో అతి చిన్న నిడివిగల పాత్రలో నటించాడు. కాకపోతే అందులో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే పదాన్ని వాడుతూ ఉంటాడు. ఈ సీన్ అద్భుతంగా పండడం , ఈయనకు 30 ఇయర్స్ పృథ్వి అనే పేరు రావడం జరిగింది. ఇక అప్పటి నుండి పృథ్వీరాజ్ అంటే కంటే కూడా 30 ఇయర్స్ పృధ్విరాజ్ అంటేనే ఎక్కువ మంది చాలా ఈజీ గా గుర్తు పడుతూ ఉంటారు. ఇకపోతే ఈయన గోపీచంద్ హీరోగా రూపొందిన లౌక్యం మూవీ తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఈ మూవీ లో ఈయన కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా తర్వాత నుండి ఈయనకు వరుస సినిమా అవకాశాలు దక్కడం మొదలు అయ్యాయి. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో కాస్త ఈయన రాజకీయాలపై దృష్టి పెట్టడంతో పృద్వి సినిమాల సంఖ్య కాస్త తగ్గింది. మళ్లీ ఈయన సినిమాలలో వరుస పెట్టి నటిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈయన ఓ సినిమా ఈవెంట్ లో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈయన తదుపరి మూవీల గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.

తాజాగా పృధ్విరాజ్ మాట్లాడుతూ ... నేను గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వం మూవీ లో ఓ పాత్రలో నటించాను. ఇకపోతే ఆ పాత్ర కోసం మొదట బ్రహ్మానందం ను అనుకున్నారు. కానీ ఆయన తేదీలు కుదరకపోవడంతో నన్ను అప్రోచ్ అయ్యారు. ఇక ఆ సినిమాలో నేను కార్ డ్రైవర్ గా కనిపిస్తాను. నేను కనిపించేది కొంత సమయమే అయినా అందులో అద్భుతమైన కామెడీ ఉంటుంది. నాది గోపీచంద్ ది అద్భుతమైన కాంబో , అలాగే శ్రీను వైట్ల కూడా అద్భుతంగా కామెడీని పండిస్తాడు. ఇక విశ్వం సినిమాలో నా కామెడీ మీ అందరికీ నచ్చుతుంది అని పృథ్వీరాజ్ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: