దేవర లో ఎన్టీఆర్ పోషించబోయే రెండు పాత్రల పేర్లు ఇవే.. కొరటాల పెద్ద ప్లానే వేశాడుగా..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే ప్రకటించింది. ఇక ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ తో పాటు మరో విలన్ పాత్ర కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాలో రెండవ విలన్ కూడా బాలీవుడ్ నటుడే అని సమాచారం. బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి బాబి డియోల్ ఈ సినిమాలో సెకండ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఒక పాత్రలో తండ్రి గానూ , మరొక పాత్రలో కొడుకు గానూ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ ఈ సినిమాలో పోషించబోయే రెండు పాత్రలలో తండ్రి పాత్ర పేరు దేవర అని , కొడుకు పాత్ర పేరు వర అని తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాలో తండ్రి పాత్ర అయినటువంటి దేవర మరియు సైఫ్ అలీ ఖాన్ మధ్య పోరాటం ఉండబోతున్నట్లు , ఇక కొడుకు పాత్ర వర మరియు బాబి డియోల్ మధ్య పోరాట సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. అందులో మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై ప్రస్తుతానికి ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: