"VD 12" లో సీరియల్ బ్యూటీ.. గౌతమ్ డెసిషన్ కి షాక్ లో విజయ్ ఫ్యాన్స్..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ విజయ్ దేవరకొండ ఆఖరుగా ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ... పరుశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు.  మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ప్రస్తుతం విజయ్ , గౌతమ్ తిన్ననురి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

ఈ మూవీ కి టైటిల్ ని ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ సినిమా విజయ్ కెరియర్ లో 12 వ సినిమాగా రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ VD 12 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఇకపోతే ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ ను హీరోయిన్ గా మూవీ యూనిట్ ఎంపిక చేసుకుంది. ఇప్పటికే ఈమె పై మూవీ బృందం చిత్రీకరణను కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. ఈ బ్యూటీ ప్రస్తుతం రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు.

ఈ మూవీ తోనే ఈమె తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇలా ఈమె నటించిన మొదటి సినిమా విడుదల కాకుండానే ఈమెకు VD 12 తో పాటు మరికొన్ని తెలుగు సినిమాలలో కూడా అవకాశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే VD 12 మూవీ లో సీరియల్ నటి అయినటువంటి నవ్య స్వామి కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈమె ఇంటింటి రామాయణం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇలా సీరియల్ బ్యూటీ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd

సంబంధిత వార్తలు: