దేవర కోసం బాలీవుడ్ శత్రు సైన్యం..!

shami
ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఎన్టీఆర్ మూవీ దేవర గురించి వస్తున్న ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తుంది. rrr తో గ్లోబల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ఎన్ టీ ఆర్ రాబోతున్న దేవర సినిమాతో కూడా రికార్డులను గురి పెట్టుకున్నాడు. ఆచార్య ఫ్లాప్ తో కసి మీద ఉన్న కొరటాల శివ దేవర తో దమ్ము చూపించాలని చూస్తున్నాడు. ఐతే దేవర సినిమా కోసం భారీ ప్లానింగ్ తో వస్తున్నాడు కొరటాల శివ. ఇప్పటికే సినిమాలో విలన్ గా సైఫ్ అలి ఖాన్ ని ఫిక్స్ చేస్తుండగా ఆయన సరిపోడని మరో విలన్ ని సిద్ధం చేస్తున్నారు.
దేవర కోసం కొరటాల శివ మరో విలన్ ని కూడా తీసుకుంటున్నారని టాక్. అతనెవరో కాదు యానిమల్ సినిమాతో రచ్చ చేసిన బాబీ డియో అని తెలుస్తుంది. బాలీవుడ్ లో బాబీ డియోల్ ఫాం లో లేని టైం లో యానిమల్ సినిమా అదరగొట్టేసింది. యానిమల్ తో ఆయన తిరిగి ఫాం లోకి రాగా అప్పటి నుంచి వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నాడు.
యానిమల్ తర్వాత కంగువ లో ఛాన్స్ అందుకున్న బాబీ డియోల్ బాలయ్య సినిమాలో కూడా నటిస్తున్నాడు. విలన్ గా మళ్లీ కెరీర్ గాడిన పడినట్టుగా అనిపిస్తున్న బాబీ డియోల్ కు ఇప్పుడు ఏకంగా దేవర సినిమాలో కూడా ఛాన్స్ రావడం విశేషం. కచ్చితంగా ఎన్ టీ ఆర్ సినిమాలో బాబీ డియోల్ ఉంటే మాత్రం అతనిని మరింత పాపులారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. దేవర 1 లో సైఫ్, దేవర 2 కోసం బాబీ ఇద్దరు బాలీవుడ్ విలన్లు ఎన్ టీ ఆర్ కోసం పనిచేస్తున్నారు. బాలీవుడ్ శత్రు సైన్యంతో దేవర ఢీ కొడితే బాక్సాఫీస్ లు షేక్ అవ్వాల్సిందే అని ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: