బాహుబలి 2 రికార్డులకు చెక్ పెట్టడానికి రెడి అయిన జక్కన్న?

Purushottham Vinay

పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి 2' సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹1810 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇది 1000 కోట్ల క్లబ్ లో చేరిన తొలి భారతీయ చిత్రంగా.. దేశీయ మార్కెట్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసి చరిత్రకెక్కింది. ఆ తర్వాత రాజమౌళి కూడా మళ్ళీ తన రికార్డును తాను బ్రేక్ చేయలేకపోయారు. rrr మూవీ వరల్డ్ వైడ్ గా ₹1387+కోట్లు మాత్రమే రాబట్టింది. దీంతో పాటుగా దంగల్, KGF-2, జవాన్, పఠాన్ తాజాగా కల్కి 2898 AD సినిమాలు కూడా  వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాయి. దీంతో ఇప్పుడు రాజమౌళి టార్గెట్ అంతకు మించి ఉండాలని టాలీవుడ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.'ఆర్.ఆర్.ఆర్' మూవీతో మ్యూజిక్ విభాగంలో ఆస్కార్ అవార్డు సాధించినప్పటికీ.. 'బహుబలి 2: ది కన్క్లూజన్' రికార్డులు బ్రేక్ చేయలేకపోయారు రాజమౌళి. అందులో కూడా గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన తర్వాత, ఇప్పుడు రాజమౌళి మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. మిగతా దర్శకుల లాగా రాజమౌళి ఇప్పుడు వెయ్యి కోట్ల క్లబ్ లో చేరితే సరిపోదు. మినిమం 1500 కోట్లకు పైగా వసూళ్లతో rrr ను దాటడమే కాదు, కచ్చితంగా 1800+ కోట్లు కొల్లగొట్టి 'బాహుబలి 2' రికార్డ్ ను బ్రేక్ చేసి చూపించాల్సిన అవసరముంది.


అందుకు సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే SSMB 29 చిత్రాన్ని టార్గెట్ గా పెట్టుకున్నాడు రాజమౌళి. ఈ సినిమాని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. దీన్ని ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకెళ్లడానికి రాజమౌళి అనేక రకాలుగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం హలీవుడ్ టెక్నీషియన్స్ తో విజువల్ ఎఫెక్ట్స్ చేయించే ప్లాన్ లో ఉన్నారు. ఈ సినిమా కచ్చితంగా మన ఇమేజినేషన్ కి అందని స్థాయిలో ఉంటుందని, అన్ని సినిమాలకి బాప్ లా ఉండబోతోందని రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు కూడా అన్నారు. మహేశ్ బాబు మూవీపై అంచనాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే, ఈసారి 'బాహుబలి 2' సినిమా రికార్డ్స్ దాటే అవకాశం ఉందనిపిస్తుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు మూవీ కోసం ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లుగా కూడా టాక్ ఉంది. కాబట్టి 'బాహుబలి 2' సినిమాను టార్గెట్ గా పెట్టుకొని ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: