రాయన్ టైటిల్ వెనుక ఎంత కథ ఉందో తెలుసా.. అంతా క్లియర్ గా చెప్పేసిన సందీప్ కిషన్..!

MADDIBOINA AJAY KUMAR
కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో ధనుష్ ఒకరు. ఈయన తాజాగా రయాన్ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ధనుష్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఈ సినిమాలో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి సందీప్ కిషన్ కూడా ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ని జూలై 26 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు.

దానితో ఈ మూవీ బృందం తెలుగు లో కూడా భారీ ఎత్తున ప్రచారాలను నిర్వహిస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం ఓ ఈవెంట్ ను నిర్వహించింది. అందులో సందీప్ కిషన్ మాట్లాడుతూ ... ఈ సినిమా టైటిల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. తాజాగా సందీప్ కిషన్ మాట్లాడుతూ ... ఇందులో మా ఇంటిపేరు రాయన్. తెలుగు సౌండ్ ఉండేలా ఏదైనా టైటిల్ ఉంటే బాగుంటుందేమో అని నేను ధనుష్ ని అడిగాను. దానితో ఆయన ఇది నార్త్ మద్రాస్ లో జరిగే స్టోరీ. తెలుగు లో టైటిల్ మారిస్తే ఆ ఫ్లేవర్ మ్యాచ్ చేయలేం అని ఆయన అన్నారు.

నార్త్ మద్రాసులో జరిగిన కథని టైటిల్ మార్చకుండా తెలుగులో డబ్బింగ్ లో చూడడమే బాగుంటుంది అని ఆయన అన్నారు. అందుకే వేరే టైటిల్ కంటే రయాన్ టైటిలే బాగుంటుంది అని ఆయన సూచించారు. ఇకపోతే ఈ సినిమాని తెలుగు లో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు విడుదల చేయనున్నారు. ఈ సినిమాను తెలుగు లో అత్యత భారీ ఎత్తున విడుదల చేయడానికి ఈ సంస్థ వారు సన్నాహాలను ఎప్పటి నుండే మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sk

సంబంధిత వార్తలు: