షాక్: అది లేకుండా ఉండలేనంటున్న సమంత.. వీడియో వైరల్..!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట ఏం మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది హీరోయిన్ సమంత.. ఆ తర్వాత తన అందం అభినయంతో ఆకట్టుకున్న సమంత ఎన్నో చిత్రాలలో నటించి ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా పాపులారిటీ అందుకున్నది. అలాంటి సమయంలోనే అక్కినేని హీరో నాగచైతన్యని ప్రేమించి మరి వివాహం చేసుకుంది. అలా వివాహం చేసుకున్న నాలుగేళ్లకే విడాకులు బాట పట్టింది ఈ జంట. ఆ తర్వాత సమంత మయోసైటిస్ అనే వ్యాది బారిన పడడం జరిగింది.

దీంతో నెమ్మదిగా సినిమాలకు దూరమైన సమంత ఆ తర్వాత తన ఆరోగ్యం పైన ఫోకస్ పెట్టి ప్రస్తుతం సినిమాలలో రీఎంట్రీ  తో నటించడానికి సిద్ధంగానే ఉన్నది.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ పలు రకాల వీడియోలను ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే సమంతకు సంబంధించి ఒక చిన్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. గతంలో బాలీవుడ్ లో ఏదో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత అక్కడ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

అసలు విషయంలోకి వెళ్తే ఆమెకు ఆహారం ,శృంగారం ఈ రెండిట్లో ఏది లేకుండా ఉండగలరు అని ప్రశ్నించగా.. సమంత ఈ విషయం పైన కాసేపు ఆలోచించి ఆహారం లేకుండా ఉండగలను కానీ శృంగారం లేకుండా ఉండలేను అన్నట్లుగా సమాధానం ఇచ్చింది. ఈ సమాధానం విన్న అభిమానులు సైతం నేటిజన్స్ కాస్త ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది ఈ వీడియో చూసిన తర్వాత సమంత చెప్పిన ఆన్సర్ కి చాలామంది ప్రశంసించడం కూడా జరిగింది.. సమంత చివరిగా ఖుషి సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది.ప్రస్తుతం హాలీవుడ్ రేంజ్ లో సినిమాలలో నటించేందుకు సిద్ధమయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: