జయాను పెళ్ళాడటానికి అమితాబ్ పెట్టిన కండిషన్ తెలిస్తే షాకవుతారు?

Purushottham Vinay

బాలీవుడ్ లెజెండరీ స్టార్ జంటగా మంచి పేరు తెచ్చుకున్నారు అమితాబ్ బచ్చన్ , జయా బచ్చన్ . జయా బచ్చన్ చాలా కష్ట సమయాల్లో కూడా తన భర్త అమితాబ్ బచ్చన్ కు మద్దతుగా నిలిచింది. ముఖ్యంగా బాలీవుడ్ లెజెండరీ నటి రేఖతో అమితాబ్ బచ్చన్ రిలేషన్ షిప్ గురించి మీడియాలో చాలా రకాల పుకార్లనేవి వచ్చినప్పుడు, జయా బచ్చన్ కేవలం అవి పుకార్లు మాత్రమే అని నిరూపించారు.  అలా ప్రతీ విషయంలో కూడా తన భర్త అమితాబ్ బచ్చన్ కి తోడుగా ఉంది జయ బచ్చన్. అయితే జయా బచ్చన్‌ను పెళ్లి చేసుకోవాడానికి మాత్రం బిగ్ బీ  అమితాబ్ బచ్చన్ ఓ  కండిషన్ పెట్టాడని తెలుసా? ఇంతకీ ఆయన ఏం కండీషన్ పెట్టాడన్నది ప్రస్తుతం చాలా ఉత్కంఠగా మారింది. అమితాబ్ బచ్చన్ ఇంకా జయ బచ్చన్ పెళ్లి 1973 వ సంవత్సరంలో జరిగింది. అయితే పెళ్లికి ముందు అమితాబ్ బచ్చన్ జయ పనివేళలు తగ్గించుకోవాలని షరతు పెట్టారట. 


ఈ విషయంపై తాజాగా జయా బచ్చన్ మాట్లాడటం జరిగింది.అయితే పెళ్లయ్యాక మీ పనిగంటలు తగ్గించుకోవాలని..పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించొచ్చని చెప్పారట. కానీ రోజువారీ పని మాత్రం ఉండకూడదు. సరైన వ్యక్తులతో మాత్రమే పని చేయాలి అని కొన్ని షరతులు పెట్టారట అమితాబ్ బచ్చన్. ఇక తన పెళ్లి గురించి తన తండ్రితో మాట్లాడినప్పుడు ఆయన సంతోషంగా లేడని జయ బచ్చన్ వెల్లడించింది.ఇదిలా ఉంటే బిగ్ బి ఒ సందర్భంలో తన భార్య జయా బచ్చన్‌ను ప్రశంసించడం జరిగింది. పెళ్ళి తరువాత ఆమె సినిమాలకు పెద్దగా  ప్రాధాన్యత ఇవ్వలేదని అమితాబ్ బచ్చన్ అన్నారు. జయ బచ్చన్ ఇంట్లోనే ఉంటూ తన పిల్లలైన అభిషేక్ బచ్చన్, శ్వేతా బచ్చన్‌లను  చూసుకున్నారట. తన కెరీర్ ను కుటుంబం కోసం త్యాగంచేసిందంటూ అమితాబ్ బచ్చన్ ఆమెని ప్రసంశించారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ 80 ఏళ్లు దాటినా కూడా కుర్ర హీరోలకంటే చాలా హుషారుగా పనిచేస్తున్నారు. కల్కీ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం రజినీకాంత్ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ కంటే సౌత్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు అమితాబచ్చన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: