ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే మళ్లీ చిరు.. చరణ్ ఇద్దరికీ బ్లాక్ బాస్టర్లు గ్యారంటీ..?

Pulgam Srinivas
సినీ పరిశ్రమలో కొన్ని సందర్భాలలో కొన్ని సెంటిమెంట్లు రిపీట్ అయితే బ్లాక్ బస్టర్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం , వచ్చే సంవత్సరం మెగా హీరోలకు ఇలాంటి సెంటిమెంట్ ఒకటి ఎదురు కానుంది. మరి ఆ సెంటిమెంట్ తో వారికి బ్లాక్ బస్టర్ విజయాలు వస్తాయి లేదో చూడాలి. 2016 వ సంవత్సరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ధ్రువ సినిమా డిసెంబర్ నెలలో విడుదల అయింది. ఇక ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా కంటే ముందు రామ్ చరణ్ కు కొన్ని అపజయాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ తో ఆయనకు అద్భుతమైన విజయం దక్కడం మాత్రమే కాకుండా ఒక సరికొత్త ఈమేజ్ కూడా దక్కింది. ఇక 2016 వ సంవత్సరం ధ్రువ మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని రామ్ చరణ్ అందుకోగా ఆ తర్వాత 2017 వ సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన తండ్రి అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి "ఖైదీ నెంబర్ 150" మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇకపోతే ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ మూవీ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర మూవీ ని కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనితో ధ్రువ తో చరణ్ కి  ఖైదీ నెంబర్ 150 తో చిరు కి అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాలు దక్కినట్లు గేమ్ చేంజర్ , విశ్వంభర మూవీలతో కూడా ఈ ఇద్దరు హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: