టాక్సిక్ మ్యానియాతో షాక్ !

Seetha Sailaja
‘కేజీఎఫ్ 2’ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన యష్ కు ఎన్ని ఆఫర్లు వచ్చినా వాటిని ఏమాత్రం ఓకె చేయకుండా తన తదుపరి సినిమా విషయంలో చాల ఆచితూచి అడుగులు వేశాడు. అనేక ఆలోచనలు తరువాత అనేక కథలు విన్న తరువాత యష్ ఓకె చేసిన మూవీ ‘టాక్సిక్’. ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు యష్ తో పనిచేయడానికి ఆశక్తి కనపరిచినప్పటికీ వారిని కాదు అనుకుని ఏమాత్రం అనుభవం లేని మహిళా డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ చెప్పిన కథకు ఓకె చేయడం ఇప్పుడు ఫిలిమ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

మొదట్లో యష్ ఈసినిమాను ఓకె చేయడం అని చాలామంది భావించారు. అయితే ఈమూవీ కథ బయటకు లీక్ అయ్యాక ఈ మూవీ పై భారీ అంచనాలు పెరిగి పోతున్నాయి. కీయారా అద్వానీ తారా సుతారియా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీని 300 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్నారు.

1950 నుంచి 1970 మధ్యలో గోవా కేంద్రంగా జరిగిన డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ ని కథగా మార్చి ‘టాక్సిక్’ మూవీని తీస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హ్యూమా ఖురేషి నెగటివ్ రోల్ లో నటిస్తూ ఉండగా నయనతార యష్ కి అక్కయ్యగా నటిస్తోంది. ఇప్పటి వరకు ఏసీనిమాలోనూ కనిపించని డార్క్ విజువల్స్ ఇందులో ఉంటాయని అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో వచ్చే యాక్షన్ సీన్స్ చాల హైలెట్ గా ఉంటాయట.

ఈసినిమా షూటింగ్ కోసమే రెండు వందల రోజులు సమయాన్ని కేటాయిస్తున్నారు అంటే ఈమూవీ మేకింగ్ ఏస్థాయిలో రిచ్ గా ఉంటుందో అర్థం అవుతుంది. ఈసినిమా షూటింగ్ గోవాలో కొంత భాగం మారిమయు విదేశాల్లో తీస్తారని తెలుస్తోంది. ఈమూవీలో యష్ చాల డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈమూవీని వచ్చే సంవత్సరం సమ్మర్ రేస్ లో విడుదల చేయాలని ఆలోచన అని అంటున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: