ఆ సినిమా OTTలో సౌండ్ బాగానే వినిపిస్తుందే..?

shami
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చి ఇప్పటికీ హీరోగా నిలదొక్కుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు సుధీర్ బాబు. ఎస్.ఎం.ఎస్ అనే సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు తన ఫిజిక్ తో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నా కటౌట్ కి తగిన హిట్ పడట్లేదు అన్న టాక్ మాత్రం ఉంది. ఆడియన్స్ చేత శభాష్ అనిపించుకోవాలని సుధీర్ బాబు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు కానీ అవేవి పెద్దగా వర్క్ అవుట్ కావు. సుధీర్ బాబు చేస్తున్న సినిమాలు అతను పెడుతున్న ఎఫర్ట్స్ చూస్తే ఇతనికి ఒక మంచి సాలిడ్ హిట్ పడితే బాగుండని అనుకుంటారు.
సుధీర్ బాబు రీసెంట్ మూవీ హరోం హర జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా యాక్షన్ అడ్వెంచర్ గా టాక్ పర్వాలేదని వచ్చింది. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం సినిమా నిలబడలేకపోయింది. జ్ఞానసాగర్ ద్వారక డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈమధ్యనే ఓటీటీలో రిలీజైంది. ఐతే థియేటర్ లో చూడని ఆడియన్స్ అంతా ఓటీటీలో చూసి సినిమా సూపర్ అనేస్తున్నారు. అదేంటి థియేటర్ లో పెద్దగా ఎక్కలేదని ఇప్పుడు ఓటీటీలో ఎందుకు సూపర్ అంటున్నారు అంటే.. అక్కడే చిన్న లాజిక్ ఉంది.
జనాలు ఈమధ్య డబ్బులు ఊరకనే ఖర్చు పెట్టేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దాదాపు థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసే ఆడియన్స్ సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. అందుకే కొన్ని సినిమాలు బాగుంటాయా ఆ అంత ఖర్చు పెట్టి ఏం చూస్తాం లే ఓటీటీలో వచ్చాక చూద్దాంలే అనుకుంటారు. సుధీర్ బాబు హరోం హర సినిమా పరిస్థితి అదే అయినట్టు ఉంది. సినిమా పలు ఓటీటీల్లో రిలీజైంది. ఐతే అమేజాన్ ప్రైం వీడియో లో ట్రెండింగ్ లో ఉంది. దేశీయ సినిమాల లిస్ట్ లో టాప్ లో ఉంటూ సినిమా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సో థియేటర్ లో పెద్దగా ఎక్కని ఈ సినిమా ఓటీటీలో మాత్రం సౌండ్ బాగానే చేసి సూపర్ అనిపించుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: