మిస్టర్ బచ్చన్ నుంచి ఊర మాస్ సాంగ్.. ప్రోమో అదిరిపోయిందిగా..!!

murali krishna
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ  – హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘మిస్టర్ బచ్చన్’. రవితేజ అమితాబ్ బచ్చన్ అభిమానిగా కనిపించబోతున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్, సాంగ్స్ ఆకట్టుకోగా.. తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమాకు ట్యాగ్‌లైన్. అయాంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్‌గా, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.ఫస్ట్ సింగిల్‌తో మెలోడియస్ ట్రీట్ ఇచ్చిన ‘మిస్టర్ బచ్చన్’.. ఈసారి స్పీకర్‌లను బ్లాస్ట్ చేసే ఎనర్జిటిక్ మాస్ చార్ట్‌బస్టర్‌తో రెడీ అయ్యాడు. మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్‌ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ నుంచి సెకండ్ సింగిల్ ‘రెప్పల్ డప్పుల్’ రిలీజ్ ఎప్పుడో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘మిస్టర్ బచ్చన్’ సెకండ్ సింగిల్ జూలై 25న విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ ఓ పోస్టర్ వదిలారు.ఈ పోస్టర్ రవితేజను కలర్ ఫుల్ అవుట్ ఫిట్ లైవ్లీ అవతార్‌లో ప్రజెంట్ చేసింది. రవితేజ మాస్, గ్రేస్‌ఫుల్ మూవ్‌లో కనిపించారు. మిక్కీ జె మేయర్ స్కోర్ చేసిన ఈ పాటలో రవితేజ డ్యాన్స్ ఫ్లోర్‌‌ను అదరగొట్టబోతున్నారనే విషయాన్ని ఈ పోస్టర్ తెలియజేస్తోంది.అయితే ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ అధ్బుతమైన సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: