కియారా బంగారు సోయగాన్ని చూశారంటే కళ్ళు తిప్పుకోరంతే?

Suma Kallamadi
బాలీవుడ్ తార కియారా అద్వానీ గురించి తెలుగు కుర్రాళ్ళక్లు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అమ్మడి అందానికి మనవాళ్ళు ఎప్పుడో క్లీన్ బౌల్డ్ అయ్యారు. వినయ విధేయ రామ, భరత్ అనే నేను సినిమాలతో ఆమె మన తెలుగు వాళ్ళని పలకరించింది. ఆ తరువాత ఆమె తిరిగి వెనక్కి చూసుకోలేదు. అడపా దడపా ఇక్కడ సినిమాలను చేస్తూ అలరిస్తోంది. త్వరలో రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రాబోతున్న 'గేమ్ ఛేంజర్' సినిమాలో కూడా కియారానే హీరోయిన్ గా అలరించనుంది. ఇలా క్రేజీ క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమె సొంతం చేసుకుంటూ దూసుకు పోతోంది.
కియారాకి సోషల్ మీడియాలో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. మిలియన్ల సంఖ్యలో ఆమెకి ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే అమ్మడు అప్పుడప్పుడు ఏవైనా ఫోటో షూట్స్ జరిగినపుడు దానికి సంబంధించినటువంటి ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ వారి కోరికలను తీరుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అమ్మడు ఓ గోల్డెన్ టాప్ వేసుకొని ఓ ఫోటో షేర్ చేయగా... అది ఇపుడు హాట్ టాపిక్ అయింది. గోల్డెన్ టాప్ లో కియారాని చూసిన జనాలు పిచ్చెక్కిపోతున్నారు. అదిరిపోయే అందం చూపు తిప్పుకోనివ్వడం లేదంటూ కెమెంట్స్ చేస్తున్నారు.
అదలా ఉంటే... కియారా కాల్షీట్లు అడ్జస్ట్ కాకపోవడంతో గేమ్‌ చేంజర్‌ సినిమా షూటింగ్ డిలే అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. రీసెంట్‌గా దీపిక పదుకోన్‌ కాల్షీట్లు కుదరకపోవడంతో కల్కికి సినిమాకి కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదురవ్వగా ఏదోలా సర్దుకొని సినిమా రిలీజ్ చేయడం జరిగింది. అదే సూత్రం శంకర్ పాటించనున్నారని వినికిడి. మిగతా పాత్రలతో షూటింగ్ కానిచ్చి.. తరువాత కియారాతో షూట్ పెట్టుకోనున్నారని వినికిడి. ఈ క్రమంలోనే అన్ని విధాలా తమకి అందుబాటులో ఉండే కొత్త తారలను ఎంకరేజ్‌ చేయాల్సిన సమయం వచ్చిందని అంటున్నారు క్రిటిక్స్. ప్రతిభా వంతులను ప్రోత్సహించి ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో పబ్లిసిటీ ఇచ్చిన క్రెడిట్‌ మన మేకర్స్ కి ఎప్పుటినుంచో ఉంది. దాన్ని మళ్లీ గుర్తుచేసుకోవాలంటూ సలహాలు వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: