తొలిప్రేమ : పవన్ కళ్యాణ్ క్లాసిక్ మూవీకి 26 ఏళ్లు..!!

murali krishna
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ లోనే కల్ట్ క్లాసిక్ మూవీ 'తొలి ప్రేమ'.. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కు ఎంతో ప్రత్యేకం..టాలెంటెడ్ డైరెక్టర్ కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సాధించింది. అప్పటివరకు రాని డిఫరెంట్ లవ్ స్టోరీగా వచ్చిన తొలిప్రేమ మూవీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా మారారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు  విపరీతంగా నచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్లాక్ బస్టర్ మూవీ విడుదలయ్యి 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ సరసన కీర్తిరెడ్డి కథానాయికగా నటించింది. వాసుకి, అలీ, నగేష్, వేణుమాధవ్, నర్రా వెంకటేశ్వరరావు, అచ్యుత్, రవిబాబు మరియు పి.జె.శర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దేవా అద్భుతమైన సంగీతం అందించారు. 

ఈ సినిమా పాటలు ఇప్పటికీ కూడా ఓ ట్రెండ్ అని చెప్పవచ్చు.ఎస్‌ఎస్‌సి ఆర్ట్స్ పతాకంపై జి.వి.జి రాజు ఈ రొమాంటిక్ డ్రామా ని నిర్మించారు.ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మైల్ స్టోన్ గా నిలిచింది.అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ గా వున్నాడు. ఆయన మూవీ లైనప్ లో మూడు భారీ సినిమాలు వున్నాయి. ‘ఓజీ’,’ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు.. ఈ మూడు సినిమాల కోసం పవన్ త్వరలో డేట్స్ కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ మూడు సినిమాలను పూర్తి చేసుకొని కొన్నాళ్ళ పాటు సినిమాలకు దూరంగా ఉండాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా భాద్యతలు స్వీకరించిన పవన్ రాష్ట్ర అభివృద్ధి దిశగా పని చేస్తున్నారు.త్వరలోనే పవన్ షూటింగ్ స్పాట్ లో అడుగు పెట్టనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: