షారుక్ Vs ప్రభాస్: పాన్ ఇండియా నెంబర్ 1 హీరో ఎవరు?

Purushottham Vinay

'కల్కి 2898 AD' సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించడంతో రెబల్ స్టార్ ప్రభాస్ పేరిట ఎన్నో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాసే 'బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ స్టార్' అనే చర్చ ఇప్పుడు నెట్టింటా మొదలైంది.'బాహుబలి' మూవీతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. 'బాహుబలి 2' మూవీతో బాక్సాఫీస్ ను షేక్ చేసారు. భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఏకైక హీరోగా రికార్డ్ క్రియేట్ చేసారు. రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరిన మొట్ట మొదటి హీరోగా కూడా ప్రభాస్ చరిత్ర సృష్టించారు. అయితే ఆ తర్వాత ఫ్లాప్ చిత్రాలతో కూడా భారీ కలెక్షన్స్ సాధించారు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా పాన్ ఇండియా అంటున్నారు కానీ, ఈ జనరేషన్ లో దానికి బాటలు వేసింది మాత్రం ప్రభాసే అని చెప్పాలి. కల్కి మూవీతో రెండు వెయ్యికోట్ల సినిమాలున్న ఏకైక సౌత్ హీరోగా ప్రభాస్ అరుదైన ఘనత సాధించారు.టాప్ హీరో అమితాబ్ బచ్చన్ అన్నట్లు ప్రభాస్ కు రికార్డ్స్ అనేవి రొటీన్ గా మారిపోయాయని అనుకోవాలి. అయితే ప్రస్తుత బాక్సాఫీస్ లెక్కల ప్రకారం ప్రభాస్ కు పోటీగా బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ను పేర్కొంటున్నారు ఓ వర్గం హిందీ ఆడియన్స్. 


ప్రభాస్ కంటే ముందే 'పఠాన్', 'జవాన్' చిత్రాలతో రెండుసార్లు 1000 కోట్ల క్లబ్ లో చేరారనే విషయాన్ని వారు గుర్తు చేసుకున్నారు. రాజమౌళి సపోర్ట్ లేకుండా, అది కూడా రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలతో ఈ ఘనత సాధించాడని అంటున్నారు.నిజానికి ఎస్.ఎస్ రాజమౌళి సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా మారినా కూడా దాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నారు ప్రభాస్. రాజమౌళి అండ లేకుండానే ఇప్పుడు 'కల్కి 2898 AD' చిత్రంతో వెయ్యి కోట్లు కొట్టి చూపించాడు. రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి ఫ్లాప్ సినిమాలతో కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు పెట్టాడు. గతేడాది 'డంకి'తో పోటీ పడి 'సలార్' మూవీతో భారీ విజయాన్ని అందుకొని షారుక్ ఖాన్ పై చేయి సాధించాడని ప్రభాస్ ఫ్యాన్స్ షారుఖ్ ఫ్యాన్స్ కి గుర్తు చేస్తున్నారు.ప్రస్తుతానికికైతే ప్రభాస్, షారుక్ ఖాన్ లు చెరో రెండేసి 1000 కోట్ల గ్రాస్ సినిమాలను కలిగి ఉన్నారు. కాకపోతే 'పఠాన్', 'జవాన్' చిత్రాల కలెక్షన్ల వెనుక కార్పొరేట్ బుకింగ్స్ ఉన్నాయనే టాక్ కూడా ట్రేడ్ లో ఉంది. మరోవైపు ప్రభాస్ మాత్రం ఆర్గానిక్ కలెక్షన్స్ తోనే సూపర్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. కాబట్టి ప్రభాసే నెంబర్ 1 పాన్ ఇండియా హీరో అని క్లియర్ కట్ గా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: