అఖండ 2: తమన్ ని పక్కన పెట్టేసిన బోయపాటి?

Purushottham Vinay

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీ అఖండ. దీన్ని డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా బోయపాటి శ్రీను తెరకెక్కించారు.ఈ సినిమాకి సీక్వెల్ గా అఖండ 2 ఉంటుందని అప్పుడే బోయపాటి ఎనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సీక్వెల్ కి సంబందించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది. ఒక పోస్టర్ తో అఖండ 2 సినిమాని కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికే మూవీ స్క్రిప్ట్ వర్క్ ని బోయపాటి స్టార్ట్ చేసాడని సమాచారం.ఇక ఇదిలా ఉంటే అఖండ కంటే హైవోల్టేజ్ కథాంశంతో ఈ సీక్వెల్ ని బోయపాటి రెడీ చేయబోతున్నట్లు సమాచారం వినిపిస్తోంది. అలాగే ఈ సీక్వెల్ సినిమాని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు. బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఈ సినిమాతో ప్రొడ్యూసర్ గా అడుగుపెడుతోంది. ఇక అఖండ సీక్వెల్ లో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లోనే కనిపించబోతున్నారంట.ఇంకా అలాగే ప్రగ్యా జైశ్వాల్ క్యారెక్టర్ కొనసాగింపు ఉంటుందంట. ఈ స్టోరీ కూడా అఘోర క్యారెక్టర్ లో ఉన్న బాలయ్య మీదనే నడుస్తుందంట. మళ్ళీ ఆధ్యాత్మిక కోణంలో కథని డైరెక్టర్ బోయపాటి రి ప్రజెంట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే అఖండ మూవీకి ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు. 


ఆ మూవీ సక్సెస్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు. తన మ్యూజిక్ తో థమన్ గూస్ బంప్స్ క్రియేట్ చేసాడు.ఇంకా అలాగే బోయపాటి స్కంద సినిమాకి కూడా థమన్ మ్యూజిక్ అందించారు. అయితే ఆ సినిమా హిట్ కాలేదు. ఇదిలా ఉంటే అఖండ 2 సినిమా కోసం ఇప్పుడు బోయపాటి థమన్ ని పక్కన పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న హర్షవర్ధన్ రామేశ్వర్ ని అఖండ 2 కోసం బోయపాటి కన్ఫర్మ్ చేశారట. ఇప్పటికే హర్షవర్ధన్ రామేశ్వర్ యానిమల్ మూవీతో పాన్ ఇండియా లెవల్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా సక్సెస్ అందుకున్నారు. 


ఆ సినిమాకు కొన్ని సాంగ్స్ ఇంకా అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మొత్తం తనే చూసుకున్నాడు.ఇప్పుడు అఖండ 2 మూవీతో మరో ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభాస్ స్పిరిట్ సినిమాకి కూడా హర్షవర్ధన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారట. అఖండ 2 సినిమా లాంటి హైవోల్టేజ్ యాక్షన్ మూవీకి హర్షవర్ధన్ మ్యూజిక్ అందించి సక్సెస్ అందుకుంటే ఆయన క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోతుంది. ఇక ఈ సినిమాలో ఇతర క్యాస్టింగ్ ని త్వరలో బోయపాటి ఎనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం తెలుస్తోంది. మరో రెండు నెలల తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వొచ్చనే మాట వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: