ఐశ్వర్య రాజేష్ ను టార్చర్ చేస్తున్న నిర్మాత ?
నటి ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతో అందంగా ఉన్నప్పటికీ ఈ భామకి అదృష్టం కలిసి రావడం లేదు. సినిమాల్లో ఎంతో అద్భుతంగా నటించినప్పటికీ పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో సక్సెస్ కాలేకపోతోంది ఐశ్వర్య రాజేష్. తాను నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఈ బ్యూటీ ఏ మాత్రం ఆలోచించకుండా వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది.
ఇక ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారుతుందో చెప్పలేము. ఇప్పుడు ఈ బ్యూటీ విషయంలోనూ అదే జరిగింది. అందం ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ తమిళనాట స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అక్కడ వరుసగా సినిమాలు చేసుకుంటూ అందరికీ షాక్ ఇస్తోంది. ఏకంగా ఈ అమ్మడు చేతిలో తమిళంలో 7 సినిమాలు ఉన్నాయి. అంతేకాకుండా మరో నాలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయట. అయితే ఈ బ్యూటీకి తెలుగులో హీరోయిన్గా పెద్దగా అవకాశాలు రావడంలేదని తెగ ఫీల్ అవుతుందట.
దీంతో అవకాశాల కోసం తెగ ప్రయత్నాలు చేస్తుందట. ఈ క్రమంలోనే ఐశ్వర్యకు ఛాన్సులు ఇస్తానని ఓ టాలీవుడ్ నిర్మాత ఆఫర్ చేశాడట. కానీ అతను చెప్పిన విధంగా చేయాలని..... అంతేకాకుండా కమిట్మెంట్స్ కి ఒప్పుకోవాలని కండిషన్ పెట్టాడట. దీంతో ఐశ్వర్య ఈ ఆఫర్ ను తిరస్కరించిందట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.