తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో వరుణ్ సందేశ్ ఒకరు. ఈయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన హ్యాపీ డేస్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకోవడం , ఇందులో వరుణ్ తన నటనతో ఆకట్టుకోవడంతో ఈ మూవీ తో ఇతనికి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత వరుణ్ కి వరుసగా సినిమాల అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఈయన హ్యాపీ డేస్ మూవీ తర్వాత హీరోగా నటించిన కొత్త బంగారు లోకం సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడంతో ఈయన క్రేజ్ తెలుగులో మరింత పెరిగిపోయింది.
ఇక ఆ తర్వాత ఈయన అనేక సినిమాలలో నటించినా అందులో ఒకటి , రెండు మూవీలు తప్పిస్తే ఏవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. మధ్యలో కొంత కాలం పాటు గ్యాప్ తీసుకున్న ఈయన మళ్ళీ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వరుణ్ ఈ మధ్యకాలంలోనే చిత్రం చూడరా , నిందా అనే మూవీలలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక చిత్రం చూడరా మూవీ నేరుగా ఓ టీ టీ లో విడుదల కాగా , నింద మూవీ థియేటర్లలో విడుదల అయిన ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు రాచరికం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సురేష్ లంకలపల్లి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండగా , ఈశ్వర్ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు.
ఇకపోతే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు తాజాగా ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ప్రస్తుతం తెలుగులోనే వరుణ్ సందేశ్ కు గొప్ప క్రేజ్ ఏమీ లేదు. ఇక ఈ సినిమాను ఏకంగా పాన్ ఇండియా మూవీల విడుదల చేయాలి అని మేకర్స్ అనుకుంటున్నారు. మరి ఈ సినిమాలో నిజంగానే అంత దమ్ము ఉండి , విడుదల అయ్యి మంచి విజయం అందుకుంటే ఈ మూవీ ద్వారా వరుణ్ కి మంచి క్రేజ్ ఇండియా వ్యాప్తంగా లభించే అవకాశం ఉంటుంది.