ఆ ఫాంటసీ వెబ్ సిరీస్ లో సమంత..?

murali krishna
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నారు. మయోసైటిస్‍తో బాధపడుతున్న సమంత సుమారు 10 నెలలుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. చివరగా గతేడాది ఖుషి చిత్రంలో కనిపించారు. విజయ్ దేవరకొండ సరసన ఆ మూవీలో హీరోయిన్‍గా చేశారు సమంత. ఆ తర్వాతి నుంచి చికిత్స తీసుకోవడంతో పాటు అప్పుడప్పుడు విదేశాలకు వెకేషన్లకు వెళుతున్నారు. ‘మా ఇంటి బంగారం’ సినిమాను ప్రకటించిన సమంత.. ఇప్పటి వరకు ఈ మూవీని మొదలుపెట్టలేదు. సమంత ఇప్పుడు మళ్ళీ తన హెల్త్ నుంచి కోలుకొని రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సమంత ఇప్పుడు పలు చిత్రాలతో పాటుగా పలు వెబ్ సిరీస్ లు కూడా సమంత చేస్తుండగా ఈ సిరీస్ లలో బాలీవుడ్ భారీ బడ్జెట్ సిరీస్ ని ఆమె ఓకే చేసినట్టుగాఇది వరకే టాక్ వచ్చింది.డైరెక్టర్లు రాజ్, డీకే సంయుక్తంగా దర్శకత్వం వహించిన సిటాడెల్: హనీబన్నీ వెబ్ సిరీస్‍లో సమంత మెయిన్ రోల్ చేశారు. గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు రావాల్సి ఉంది. అయితే, ఈలోగానే మరో వెబ్ సిరీస్ చేసేందుకు సమంత ఓకే చెప్పారని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్‍కు రాజ్, డీకే పని చేయనున్నారు. అయితే, దర్శకులుగా కాకుండా షో రన్నర్లుగా ఉండనున్నారు. ఈ వెబ్ సిరీస్ టైటిల్ కూడా బయటికి వచ్చింది.

ఈ వెబ్ సిరీస్‍లో బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్, సమంత ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఈ సిరీస్‍కు ‘రక్త బ్రహ్మాండ్’ అని టైటిల్ ఖరారు చేసినట్టుగా సమాచారం బయటికి వచ్చింది. ముందుగా రక్తబీజ్ అని టైటిల్ అనుకన్నారట. అయితే, దాన్ని తాజాగా రక్త బ్రహ్మాండ్ అని మార్చినట్టు తెలుస్తోంది.రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ పీరియడ్ ఫ్యాంటసీ డ్రామాగా రూపొందనుంది. ఆదిత్య రాయ్ కపూర్, సమంతతో పాటు ఈ సిరీస్‍లో బాలీవుడ్ నటి వామికా గబ్బీ కీలకపాత్ర పోషించనున్నారని సమాచారం బయటికి వచ్చింది.తుంబాడ్ డైరెక్టర్‌తో..
రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‍కు తుంబాడ్ ఫేమ్ డైరెక్టర్ రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహించనున్నారు. 2018లో వచ్చిన ఫ్యాంటసీ హారర్ సినిమా తుంబాడ్ చాలా ప్రశంసలను దక్కించుకుంది. బార్వే ఈ సిరీస్‍కు దర్శకత్వం చేయడం మరింత ఇంట్రెస్టింగ్‍గా ఉంది. అతడికి ఇదే తొలి సిరీస్‍గా ఉండనుంది. ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ లాంటి సక్సెస్‍ఫుల్ సిరీస్‍లను రూపొందించిన డైరెక్టర్లు రాజ్, డీకే షోరన్నర్లుగా వ్యవహరించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: