కృతి శెట్టి కెరీర్ నాశనం చేస్తున్న నిర్మాత ?

Veldandi Saikiran
కృతి శెట్టి ఈ హీరోయిన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉప్పెన సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కృతి శెట్టి తన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఆ సినిమా అనంతరం ఈ బ్యూటీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించింది. వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. దాదాపు స్టార్ హీరోల సరసన నటించి ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ కృతి శెట్టి చాలా యాక్టివ్ గా ఉండేది. 

వరుస ఫోటోషూట్లు చేస్తూ.... ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ.... తన అభిమానులకు ఎప్పుడు టచ్ లో ఉండేది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాలను షేర్ చేసుకుంటూ ఉండేది. కేవలం సినిమాలోనే కాకుండా..... పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వంటి కార్యక్రమాల్లో కృతి శెట్టి చాలా యాక్టివ్ గా పాల్గొనేది. ప్రస్తుతం సినిమాల పరంగా కృతి శెట్టికి అస్సలు కలిసి రావడం లేదు.

తాను నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే కృతి శెట్టితో సినిమాలు తీయడానికి దర్శక నిర్మాతలు సైతం భయపడిపోతున్నారట. ఇక సినిమా అవకాశాలు రాకపోవడంతో కృతి శెట్టి కాస్త గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటో షూట్లు చేస్తోంది. అయినప్పటికీ ఎలాంటి అవకాశాలు రావడం లేదు. దీంతో ఓ తమిళ నిర్మాత కృతి శెట్టికి సినిమాల్లో చాన్సులు ఇప్పిస్తానని తన వద్దకు రమ్మని చెప్పారట.


దీంతో ప్రతి శెట్టి ఆ నిర్మాత వద్దకు వెళ్లగా....తాను చెప్పినట్టు చేస్తేనే సినిమాల్లో అవకాశాలు ఇస్తానని.... లేకపోతే ఛాన్సులు ఇవ్వనని అన్నారట. ఇక కృతి శెట్టి మాత్రం సినిమా అవకాశాలు లేకపోయినా పరవాలేదు.... నేను మీరు చెప్పినట్టు చేయనని అక్కడి నుంచి వచ్చేసిందట. ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాలో వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: