ఆ హీరోయిన్ ను సర్ప్రైజ్ చేసిన త్రివిక్రమ్..!

MADDIBOINA AJAY KUMAR
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన కథ రచయితగా , స్క్రీన్ ప్లే రచయితగా కెరియర్ మొదలు పెట్టాడు. అందులో భాగంగా ఈయన కెరియర్ ప్రారంభంలో విజయ్ భాస్కర్ దగ్గర ఎక్కువ కాలం పని చేశాడు. వీరి కాంబినేషన్ లో అనేక సినిమాలు రూపొందాయి. అందులో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇక తన కథతో , మాటలతో , స్క్రీన్ ప్లే తో అద్భుతమైన మ్యాజిక్ ను క్రియేట్ చేసిన త్రివిక్రమ్ కు ఆ తర్వాత దర్శకుడిగా సినిమా అవకాశాలు రావడంతో ఈయన ఓన్ గా సినిమాలకు దర్శకత్వం వహిస్తూ వస్తున్నాడు.
 

దానితో విజయ్ భాస్కర్ , త్రివిక్రమ్ కాంబోలో సినిమా వచ్చి చాలా కాలం అయింది. త్రివిక్రమ్ , విజయ్ భాస్కర్ దగ్గర నుండి వెళ్లిపోయినప్పటి నుండి ఆయనకు కూడా పెద్ద స్థాయిలో విజయాలు ఏమీ దక్కలేదు. ఇకపోతే విజయ్ భాస్కర్ ప్రస్తుతం ఉషా పరిణయం అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి అయినటువంటి సిరత్ కపూర్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇక ఈ ముద్దుగుమ్మ పై సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతున్న ప్లేస్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ వెళ్ళాడు. దానితో ఈ ముద్దుగుమ్మ సూపర్ ఎక్సైట్ అయ్యి తన సోషల్ మీడియా వేదికగా విజయ్ భాస్కర్ , త్రివిక్రమ్ తో ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేసి ఆయన నా సినిమా సెట్స్ లోకి రావడంతో ఎంతో ఆనందంగా ఉందని , అంతే కాకుండా త్రివిక్రమ్ గారు మానిటర్ లో నాపై సీన్స్ ని గమనించడం ఈ స్పెషల్ మూమెంట్స్ అంతా గాడ్ ప్లాన్ అంటూ , ఈ అవకాశం ఇచ్చిన దర్శకునికి థాంక్స్ అంటూ ఓ పోస్ట్ చేసింది. ఇది ఇలా ఉంటే ఉష పరిణామం సినిమా ఆగస్టు 2 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: