ఆ విషయంలో ఎన్టీఆర్ గ్రేట్.. హీరో అంటే ఇలా ఉండాలి అంటున్న ఫ్యాన్స్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఇకపోతే ఈయన బావమరిది అయినటువంటి నార్ని నితిన్ కూడా ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈయన కొంత కాలం క్రితం విడుదల అయ్యి మంచి విజయం సాధించిన మ్యాడ్ అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో ఈ నటుడికి మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ప్రస్తుతం నితిన్ బన్నీ వాసు నిర్మాణంలో రూపొందుతున్న ఆయ్ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ మూవీ ని అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి దిమ్ సాంగ్ ను విడుదల చేశారు. దాని కోసం ఓ పెద్ద ఈవెంట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్ కు ఈ సినిమాను సమర్పిస్తున్న అల్లు అరవింద్ కూడా విచ్చేశాడు. అందులో భాగంగా ఈయన అనేక విషయాలను మాట్లాడాడు. తాజాగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ... ఒక పెద్ద ఫ్యామిలీ నుండి హీరో వస్తున్నాడు కదా ఆయన ఎన్టీఆర్ కి బావమరిది కావడంతో ఆయనకు ఫోన్ చేసి ఒక రోజు మీ బావమరిది తో సినిమా చేస్తున్నాను అని చెప్పాను. దానితో జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించిన విధానం అద్భుతం. ఆయన నేను అన్న మాటలకు వెంటనే స్పందించి ... ఓకే సార్ చేయండి అని అన్నారు.

ఇక ఆ తర్వాత నేను ఇందులో పెద్దగా యాక్షన్ సన్నివేశాలు ఏమీ లేవు అని చెప్పాను. దానితో అలాంటివి ఏమీ అవసరం లేదు. అయినా మన బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఒక రోజు కూడా కాదు ఒక షో వరకే పరిమితం. షో పడ్డాక సినిమా బాలేక పోతే ఎంత పెద్ద హీరో నటించిన చూడరు. సినిమా బాగుంటే ఎవరూ లేకపోయినా పికప్ వస్తుంది అని ఆయన అన్నాడు. ఆయన మాటల అద్భుతంగా అనిపించాయి అని అల్లు అర్జున్ అన్నారు. ఇక ఎన్టీఆర్ తన బావమరిది విషయంలో అలా స్పందించడం పై ఆయన అభిమానులు హీరో అంటే ఇలా ఉండాలి అని అంటూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: