హైయెస్ట్ పారితోషికం తీసుకోవడం పై అలా రియాక్ట్ అయిన కరీనాకపూర్.. ఇది ఎవరు ఊహించకూడదు..?

Pulgam Srinivas
హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటి మణులతో కరీనా కపూర్ ఒకరు. ఈమె ఇప్పటికే అనేక హిందీ సినిమాలలో నటించింది. అందులో చాలా మూవీ లు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇక కరీనా హిందీ సినిమాలను మినహాయిస్తే వేరే ఏ భాష సినిమాలో కూడా ఎక్కువగా నటించకపోయినా ఈమె హిందీ మూవీ ల ద్వారానే ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఒక్కో మూవీ కి ఈమెకు 10 నుండి 15 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ అందుతున్నట్లు తెలుస్తోంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా ఈమె అనేక ఆసక్తికరమైన సమాధానాలను ఇచ్చింది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ తాను తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ఆ స్థాయికి రావడానికి గల కారణాలను స్వయంగా ఈమె చెప్పింది. తాజాగా కరీనా కపూర్ మాట్లాడుతూ ... నేను ప్రస్తుతం 19 నుండి 15 కోట్ల వరకు ఒక్కో మూవీ కి రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నాను. ఇంత పారితోషకం తీసుకునే స్థాయికి రావడం కోసం నేను ఎన్నో కష్టాలను అనుభవించాను.

ఇకపోతే రెమ్యూనరేషన్ ప్రధాన అంశంగా నేను ఎప్పుడు భావించను. కొన్ని సమయాలలో ఒకరు చెప్పిన కథ అద్భుతంగా ఉండి  , అందులోని నా పాత్ర కూడా అంతే అద్భుతంగా ఉన్నట్లు అయితే ఆ సినిమా చేయాలి అనుకునే నిర్మాత అంత నాకు ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నట్లు అయితే నేను చాలా తక్కువ రెమ్యూనరేషన్ కూడా సినిమాలు చేస్తూ ఉంటాను. అలా చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. రెమ్యూనిరేషన్ అనేది ఒక విషయం అంతే కానీ అదే కచ్చితంగా ప్రణాళిక అనేది కాదు అని తాజాగా కరీనా కపూర్ చెప్పుకొచ్చింది. తాజాగా కరీనా కపూర్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

kk

సంబంధిత వార్తలు: