జగన్ తన మాటల గారడితో అసెంబ్లీలో కూటమికి చుక్కలు చూపించగలడా..?

Pulgam Srinivas
జూలై 22 వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి . ఇక ఈ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి హాజరు అవుతారా ... లేదా అనే అనుమానాలు జనాలలో , రాజకీయ నాయకులలో రేకెత్తాయి . కాకపోతే వై సీ పీ శ్రేణులు మాత్రం కచ్చితంగా ఈ సారి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు వై యస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాబోతున్నట్లు గట్టిగా చెబుతున్నాయి .

ఇకపోతే వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ సారి అనేక సమస్యలపై మాట్లాడాలి అని గట్టిగా పిక్స్ అయినట్లు తెలుస్తోంది . కాకపోతే వై సీ పీ పార్టీ నుండి ప్రస్తుతం కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు . ఇక అందులో కూడా గట్టి వాక్చాతుర్యం కలిగిన వారు ఎక్కువ లేరు . చాలా మంది జూనియర్స్ ఉన్నారు. దానితో భారం అంతా జగన్మోహన్ రెడ్డి పై మాత్రమే పడింది. మరి ఆయన వీటిని ఏ స్థాయిలో ఎదుర్కొంటాడు అనేదే ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఇప్పటికే జరిగిన అనేక అల్లర్ల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి తాజా అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడాలి అని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది .

మరి అసెంబ్లీ లో కూటమి కి సంబంధించిన వ్యక్తులు అనేక మంది ఉన్నారు. కేవలం వై సీ పీ వారు 11 మంది మాత్రమే ఉన్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవలసిన వారే ఎక్కువ మంది. ఆయనను టార్గెట్ చేసే సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వారందరినీ తన మాటల గారెడితో జగన్ తన వైపు తిప్పుకుంటాడా లేదా అనేదే చాలా ప్రశ్నార్థకంగా మారింది. మరి జగన్ ఈ సారి అసెంబ్లీ సమావేశాలలో ఏ స్థాయిలో కూటమి నేతలను ఎదుర్కొంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: