ఆ హీరో కి హిట్ ఇవ్వడానికి తెగ ప్రయత్నం చేస్తున్న దిల్ రాజు.. ఈసారైనా సక్సెస్ అయ్యేనా..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ ను మొదలు పెట్టి మొదట కొన్ని ఆపజాయలను ఎదుర్కొని ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వి వి వినాయక్ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన దిల్ మూవీ తో నిర్మాతగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో నిర్మాత గా దిల్ రాజు కు తెలుగు లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత దిల్ రాజు ఆచి తుచి సినిమా చేస్తూ ముందుకు వెళ్లాడు.

అందులో భాగంగా ఈయన కెరియర్ ను మొదలు పెట్టిన చాలా సంవత్సరాల వరకు అపజయం ఎరుగని నిర్మాతగా కెరియర్ ను కొనసాగించాడు. ఇలా నిర్మాతగా కెరియర్ ను మొదలు పెట్టడంలో కీలక పాత్రను పోషించిన నితిన్ తో ఈయన కొంత కాలం క్రితం దిల్ రాజు "శ్రీనివాస కళ్యాణం" అనే సినిమాను తెరకెక్కించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇక ప్రస్తుతం దిల్ రాజు , నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు అనే మూవీ ని నిర్మిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్స్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ యూనిట్ ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించలేదు ఇకపోతే. ఈ మూవీ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం దిల్ రాజు భారీ బడ్జెట్ ను కేటాయించినట్లు , అందులో భాగంగా ఈ సినిమాను అత్యంత భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను అత్యంత భారీ బడ్జెట్ తో చాలా గ్రాండ్ గా తెరకెక్కించినట్లు సమాచారం. మరి ఈ మూవీ తో నితిన్ కు ఏ స్థాయి విజయం అందుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

dr

సంబంధిత వార్తలు: