కొత్త కోడలు రాకతో అంబానీల సంపద ఎన్ని వేలకోట్లు పెరిగిందో తెలిస్తే..??

Suma Kallamadi

సాధారణంగా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని అంటారు. అంటే ఇల్లు కట్టినాక లేదంటే పెళ్లి చేసుకున్నాక ప్రజలు తమ వద్ద పెద్దగా డబ్బులు లేకుండా మిగిలిపోతారు. ధనవంతులతో పాటు పేద, మధ్యతరగతి ప్రజలకు ఇది వర్తిస్తుంది. ఎవరైనా సరే వారి ఆస్తులు ఎంతో కొంత ఇలాంటి వాటి వల్ల కోల్పోతారు. వాటిపై పెట్టే ఖర్చు తిరిగి వెనక్కి రాదు. కానీ అంబానీ మాత్రం కొడుక్కి పెళ్లి చేశాక, కోడలి రాకతో నష్టపోవడం మాట అటు ఉంచితే వేలకోట్లు లాభపడ్డారు.

బిజినెస్, పెట్టుబడి వంటి వాటిలో డబ్బు పెడితే తిరిగి వస్తుందేమో కానీ పెళ్లిళ్లు, వేడుకలు, విహారయాత్రలు, లగ్జరీ కోసం పెట్టే రూపాయి కూడా తిరిగి రాదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అంబానీ మాత్రం ఇది తప్పు అని నిరూపించారు. ఆయన తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి రూ.5000 కంటే ఎక్కువ కోట్లతో చేసినట్లు సమాచారం.

ఆకాశమే పందిరి, భూలోకమే వేదిక అని అనిపించేలాగా అంబానీ ఇంట పెళ్లి వేడుక జరిగింది. జామ్ నగర్, యూరప్ వంటి ప్రాంతాలలో ప్రీవెడ్డింగ్ వేడుకలు జరిగితే ముంబైలో వివాహం జరిగింది. ఈ పెళ్ళి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, ధోనీ, ఐశ్వర్య రాయ్, జాన్ సీనా వంటి అనేక రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిళ్లలో అనంత్, రాధికల పెళ్లి ముందు వరుసలో నిలిచింది.

కొడుకు పెళ్లి కోసం ముఖేష్ రూ.వేల కోట్లు వెచ్చించడం వల్ల ఆయన చాలా వరకు తగ్గి ఉంటుందని కొంతమంది అనుకుంటారు. కానీ వారి అభిప్రాయం తప్పు. ఈ పెళ్లి (జులై 12)కు ముందు అంబానీ నెట్‌వర్త్ 118 బిలియన్ డాలర్లు ఉండగా పెళ్లినాటికి 121 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ విషయాన్ని బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ రిపోర్టు బయట పెట్టింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల వాల్యూ పెరగడం వల్ల ఆస్తి పెరిగింది. అనంత్, రాధిక వెడ్డింగ్ శుభ సమయాన ఈ షేర్ల విలువ 1 శాతం ఎగబాకినట్లు రిపోర్ట్స్ పేర్కొన్నాయి. దీని ఫలితంగా ముఖేష్ వరల్డ్స్ మోస్ట్ రిచెస్ట్ పర్సన్స్ లో 12 నుంచి 11 ర్యాంక్‌కు చేరుకున్నారు. ఇక ఆసియా ఖండం మొత్తంలో అత్యంత సంపన్నుడు మన ముఖేష్ అంబానీయే కావడం గర్వకారణం. సంపద పెరగడానికి కొత్తకోడలు వచ్చిన వేళావిశేషమేనని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: