చరణ్ చేయాలనుకున్న సినిమాని చేసి హిట్టు కొట్టేసిన బన్నీ?

Purushottham Vinay

మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మెగా ఇమేజ్ ఉన్న ఈముగ్గరు హీరోలకు కూడా టాలీవుడ్ లో ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిందే.. అయితే ప్రస్తుతం చరణ్, బన్నీలకు పడటంలేదని.. కోల్డ్ వార్ నడుస్తుందని మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీ దూరంగా ఉంటోందన్న టాక్ సోషల్ మీడియాలో గట్టిగా నడుస్తోంది. కాని ఈ విషయంలో మెగా హీరోలు మాత్రం ఏమాత్రం బయటపడటం లేదు.అటు అల్లు అర్జున్.. ఇటు రామ్ చరణ్.. ఇద్దరు స్టార్ హీరోలకు ఇద్దరికి భారీగా ఫ్యాన్ బేస్ ఉంది. అయితే అల్లు అర్జున్ మెగా ఇమేజ్ తో ఇండస్ట్రీకి వచ్చినా.. ప్రస్తుతం తన సొంత మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. అల్లు బ్రాండ్ ను బాగా ప్రమోట్ చేసుకున్నాడు. ఇక రామ్ చరణ్ మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పెద్ద గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను తెచ్చుకున్నాుడు. ప్రస్తుతం రామ్ చరణ్, అల్లు అర్జున్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు.ఇక ఎవరి స్టార్ డమ్ వారిది.. కలిసినప్పుడు ప్రేమగా మాట్లాడుకుంటారు.. కాని లోపల మాత్రం ఏదో జరుగుతంది అనేది అందరి ఫ్యాన్స్ లో అనుమానం.

అయితే ఈక్రమంలో ఈ ఇద్దరు స్టార్లకు సబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. పెద్ద గాసిప్ గా తిరుగుతున్న ఈ మ్యాటర్ లో నిజం ఎంతో తెలియదు కాని.. ఫ్యాన్స్ మాత్రం చెవులు కొరికేసుకుంటు బట్టలు చింపేసుకుంటున్నారు.అయితే మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ ను కాదని.. సూపర్ హిట్ సినిమా కథను అల్లు అర్జున్ కు ఇచ్చాడట. వింటానికి కాస్త విచిత్రంగా ఉన్నా.. ఇది నిజమంటున్నారు సినీ ప్రేక్షకులు.. ఇందులో నిజానిజాలు ఏమో కాని.. రామ్ చరణ్ కంటే అల్లు అర్జున్ ముందుగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా గంగోత్రి. అయితే ఈసినిమా కథ ముందుగా రామ్ చరణ్ దగ్గరకు వెళ్లిందట.రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.ఏకంగా 100రోజులు ఆడింది. ఆర్తి అగర్వాల్ చెల్లెలు అతిథి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అల్లు అర్జున్ ను హీరోగా నిలబెట్టింది. ఫస్ట్ మూవీనే సూపర్ హిట్ కొట్టడంతో ఇండస్ట్రీలో తరువాత టాలెంటెడ్ హీరోగా మారిపోయాడు బన్నీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: