ఈవారం ఓటీటీ ని షేక్ చేస్తున్న తెలుగు మూవీలు.. వెబ్ సీరీస్లు ఇవే..?

MADDIBOINA AJAY KUMAR
ప్రతి వారం లాగానే ఈ వారం కూడా అనేక సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు తెలుగు భాషలో ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. అలా ఈ వారం తెలుగు భాషలో ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు ఏవి ప్రస్తుతం అవి ఏ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి అని వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.
మ్యూజిక్ షాప్ మూర్తి : అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా తెలుగు భాషలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ లో చాందిని చౌదరి కీలక పాత్రలో నటించింది.
హరోం హర : సుధీర్ బాబు హీరో గా రూపొందిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యింది. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఈ మూవీ ప్రస్తుతం తెలుగు భాషలో ఆహా మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
హాట్ స్పాట్ : ప్రస్తుతం ఈ మూవీ తెలుగు భాషలో ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
భూమర్ అంకుల్ : ప్రస్తుతం ఈ మూవీ తెలుగు భాషలో ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
బహిష్కరణ : ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం తెలుగు భాషలో జీ 5 ఓ టి టి ప్లాట్ ఫాము లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ లో తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటి మనలలో ఒకరు అయినటువంటి అంజలి కీలకమైన పాత్రలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott

సంబంధిత వార్తలు: