సోషల్ మీడియాని ఊపేస్తున్న డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ ట్రైలర్?

Purushottham Vinay

సూపర్ విజువల్స్ .. వీఎఫ్ఎక్స్ మ్యాజిక్.. దానికి తోడు భారీ యాక్షన్ ఎపిసోడ్స్.. కథానాయకుల రంజింపజేసే సాహసాలతో .. క్రేజీ స్టార్లు నటించిన డెడ్ పూల్ ఫ్రాంఛైజీ సినిమాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఇప్పుడు ఈ సిరీస్ లో కొత్త సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ త్వరలో విడుదల కాబోతుండగా  రోజుకో స్పెషల్ సర్పరైజ్ తో మార్వెల్ మూవీ ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు మేకర్స్.రయన్ రెనాల్డ్స్, జాక్ మెన్ ప్రథాన పాత్రల్లో నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ బజ్ నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్ లో జూలై 26న విడుదలకు రెడీగా ఉంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి విడుదలైన టీజర్లు ఇంకా ట్రైలర్లు ఇప్పటికే వరల్డ్ వైడ్ ఫుల్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఆ క్రేజ్ ని మరింతగా పెంచేస్తూ డెడ్ పుల్ అండ్ వాల్వరిన్ మూవీ టీం ఫైనల్ ట్రైలర్ ని విడుదల చేశారు.ఇప్పటి దాకా విడుదలైన ప్రతి వీడియో కంటెంట్ లో కూడా ఏదొక స్పెషల్ అప్పీరెన్స్ ను పరిచయం చేస్తూ సినిమాలో డెడ్ పుల్ అండ్ వాల్వరిన్ తో పాటు ఇంకా చాలా మంది సూపర్ హీరోలు ఉన్నారనే హింట్స్ ఇస్తూ వస్తున్న మార్వెల్ టీమ్, తాజాగా విడుదల చేసిన ఫైనల్ ట్రైలర్ లో కూడా అదే పంథా కొనసాగించడం జరిగింది.


ఇక ఈ ట్రైలర్ లో లేడీ డెడ్ పుల్ అలానే వాల్వరిన్ కూతురిని పరిచయం చేశారు. డెడ్ పుల్ చేసే విన్యాసాలును ఎంజాయ్ చేసే మార్వెల్ మూవీ లవర్స్ ఇప్పుడు లేడీ డెడ్ పుల్ చేసే యాక్షన్ ని కూడా చూడబోతున్నారని స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఇందులో ఏడుగురు సూపర్ హీరోలను చూపించబోతుండడం ఆసక్తికరంగా మారింది. వారిని రక్షించేందుక ఎక్స్ మేన్ ఏం చేస్తాడో చూడాలన్న క్యూరియాసిటీని కూడా ఈ ట్రైలర్ పెంచింది. డెడ్ పుల్ అండ్ వాల్వరిన్ ఇంగ్లీష్ తో పాటు చాలా భాషల్లో కూడా విడుదల కానుంది. తెలుగులో డెడ్ పుల్ సిరీస్ కి ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని డెడ్ పుల్ & వాల్వరిన్ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. తెలుగు అనువాదం అయితే ఆసక్తికరంగా ఉంది. ఇందులో పంచ్ డైలాగులు ఇంకా జోకులు కూడా ఆడియెన్ కి కనెక్టవుతున్నాయి.ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని కలిగించే ఎలిమెంట్స్ తో సాగుతోంది. సూపర్ మేన్ సినిమాల కేటగిరీలో డెడ్ పూల్ కి ప్రత్యేకత ఉందని మరోసారి ప్రూవ్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: