ఆ స్టార్ హీరోయిన్ ముందు కుర్ర హీరోయిన్లు కూడా పనికిరారు?

Suma Kallamadi
నిన్నటితరం ముద్దుగుమ్మ గజాల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'నాలో ఉన్న ప్రేమ' అనే సినిమాతో తెలుగు పరిశ్రమలో అరంగేట్రం చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన 'స్టూడెంట్ నంబర్ 1' సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో ఎన్.టి.ఆర్ సరసన ది బెస్ట్ పెయిర్ గా పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత గజాల వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. వరుస ఆఫర్లతో కెరీర్ సూపర్ జోష్ అందుకుంది. ఐతే ఎన్టీఆర్ లాంటి సినిమాతో నటించాక అమ్మడికి స్టార్ ఆఫర్లు వస్తాయని అనుకుంది గానీ యువ హీరోలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2001 నుంచి 2005 వరకు నాలుగేళ్లలోనే 12 తెలుగు సినిమాలు 3 తమిళ సినిమాల్లో నటించి మెప్పించింది గజాల.
ఆ తరువాత ఆమె మెల్లగా సినిమాలకి దూరం అవుతూ వచ్చింది. తరువాతి క్రమంలో తమిళంలో వరుస సినిమాలు చేస్తూ కన్నడలో ఒకటి మలయాళంలో 2 సినిమాలు చేసింది గజాల. 2011లో మనీ మనీ మోర్ మనీతో తెలుగు ఆడియన్స్ ని పలకరించినప్పటికీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. తరువాత తన పర్సనల్ లైఫ్ లో బిజీ అయిపోయింది. ఐతే లేటెస్ట్ గా గజాల సోషల్ మీడియాలో మరలా యాక్టివ్ అయ్యింది. తన లేటెస్ట్ ఫోటోలు చూసిన కుర్రాళ్లు మతి పోతోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ గా చేస్తున్నప్పుడు కూడా చేయని గ్లామర్ షోని ఇప్పుడు ఫోటో షూట్స్ రూపంలో ఫాలోవర్స్ కోసం చేస్తుంది ఈ అమ్మడు.
దాదాపు 20 ఏళ్ల క్రితం స్టూడెంట్ నంబర్ 1 సినిమాలో ఆమె ఎలా ఉందో ఇప్పటి ఆమె ఫోటోలు చూస్తే అమ్మడిలో గ్లామర్ అలానే ఉందని అనిపించకమానదు. కొద్దిగా ట్రై చేస్తే ఇప్పటికీ గజాలా సినిమాల్లో నటించే అవకాశం ఉందని అంటున్నారు సినిమా ప్రియులు. అవును, ఆమె పోస్ట్ చేసిన ఫోటోస్ చూస్తే ఎవరికైనా అలాగే అనిపించకమానదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: