తన బేబీ కోసం నరేష్ కన్నీరు మున్నీరు.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్..!!

murali krishna
సూపర్ స్టార్స్ కృష్ణ – విజయ నిర్మల లా కొడుకుగా సినీ ఇండస్ట్రీ లో బాలనటుడుగా కెరియర్ మొదలుపెట్టి ఐదు దశాబ్దాలు గా సినిమాలలో నటిస్తూ అందరిని అలరిస్తున్నారు.ఎన్నో సినిమాలలో హీరోగా, ఆక్టర్ గా నటించి ప్రస్తుతం మంచి మంచి పాత్రలు చేస్తూ మరో పక్క కామిడియన్ గా కూడా నటించి తెలుగు ప్రేక్షకులనుమెప్పిస్తున్నారు. ఈయనకు బోలెడంత మంది తెలుగు ప్రేక్షకులు అభిమానులు అయిపోయారు.నరేష్  నటన మరియు కామెడీ టైమింగ్ పీక్స్ లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మధ్య కాలంలో నరేష్  సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉన్నాడు. ఎప్పుడు ఎదో ఒక చిలిపి పనితో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు.నరేష్ ఇటీవల సీనియర్ నటి పవిత్ర లోకేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈయనకు ఇది మూడవ పెళ్లి మరియు పవిత్ర కు రెండో పెళ్లి. ఆ మధ్యకాలంలో వీరికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపాయి.ఇదిలా ఉంటే ఈరోజుల్లో సినిమా తీయడం తేలికైందిగానీ ఆ సినిమాకు ప్రమోషన్స్‌ చేసుకోవడమే అన్నింటికన్నా కష్టమైంది. ఏదైనా వెరైటీగా చెబితే తప్ప ఈ తెలుగు జనాలకు ఎక్కదు. పైగా సినిమాల మధ్య పోటీ కన్నా ఓటీటీ ల మధ్యే పోటీ పెరిగిపోయింది. అందుకే కాస్త భిన్నంగా ఆలోచించారు  సీనియర్ నటుడు నరేష్ ఇటీవలే విడుదలై వెయ్యికోట్లకుపైగా వసూళ్లతో సత్తాచాటిన కల్కి సినిమాను తన చిత్రానికి ప్రమోషన్స్‌గా వాడేసుకున్నాడు.


అసలు విషయం ఏంటంటే... సీనియర్ నటుడు నరేష్‌, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో ఓ సినిమా రూపొందించారు. విహారయాత్ర.ఔట్‌ అండ్ ఔట్ కామెడీతో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగం గా ఎప్పుడూ గొడవలుపడుతూ ఉండే ఓ కుటుంబం ఈ సమస్యలన్నీ మర్చిపోయి హాయిగా ఏదైనా విహారయాత్రకు వెళ్లి ఎంజాయి చేయాలని నిర్ణయించుకుంటుంది. అనుకున్నదే తడవుగా గోవా వెళ్లి హాయిగా గడపాలనుకుంటారు. దీనికోసం తమ వద్ద ఎన్నాళ్ల నుంచో ఉంటున్న పాత మెటాడోర్ వ్యాన్‌ కు కాస్త రంగులు వేసి అందంగా ముస్తాబుచేస్తారు. దీనిపైనే వారు గోవా చేరుకోవాలని ప్లాన్ వేసుకుంటారు.ఈ జర్నీలో వారికి ఎదురైన పరిణాలే ఈ సినిమా కథ అంతా..దీనికి సంబంధించిన టీజర్‌ను సీనియర్ నటుడు నరేష్‌ వినూత్నంగా విడుదల చేశారు. ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే ...వీరు ప్రయాణిస్తున్న బేబీ..అదేనండి ఆ పాతకాలం నాటి వ్యాన్‌ను ఎవరో దొంగిలించారు. అదంటే వారందరికీ ఎంతో సెంటిమెంట్‌ కాబట్టి అది ఎవరికైనా కనిపిస్తే కాస్త చెప్పండంటూ ఓ వీడియో రూపొందించి సోషల్‌మీడియాలో అందరినీ రిక్వెస్ట్‌ చేస్తుంటాడు. అయితే కల్కి సినిమాలో బుజ్జి తెలుసుకానీ ఈ బేబీ తెలియందటూ అందరూ హేళన చేస్తున్నారని మదనపడిపోతుంటాడు. ఈ టీజర్‌ను బట్టి చూస్తే... ఈ సినిమా మొత్తం ఆ బేబీ చుట్టూ తిరగనుందని అర్థమవుతోంది. అందుకే వారు కల్కి సినిమాలో ప్రభాస్‌ వాడిన బుజ్జి అనే కారును దీనితో పోల్చుతూ ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేశారు.చిత్ర యూనిట్‌ అనుకున్నదానికన్నా ఎక్కువ రెస్పాన్స్ ఈ వీడియోకు దక్కింది. ఈ వీడియోను కల్కి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ట్యాగ్‌ చేయడంతో బాగా వైరల్ అవుతోంది.అయితే ఈ వీరాంజనేయులు విహారయాత్ర నేరుగా థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈటీవీ విన్‌ యాప్‌లో త్వరలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: