బాలయ్య ఫ్యాన్స్ కే గుడ్ న్యూస్.. "NBK 109" వచ్చేది అప్పుడే..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ బాలయ్య కెరియర్ లో 109 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమా యొక్క చిత్రీకరణను "NBK 109" అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఇ

ప్పటికే ఈ మూవీ నుండి రెండు గ్లిమ్స్ వీడియోలను విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ ను కానీ , ఈ సినిమా విడుదల తేదీని కానీ మేకర్స్ ప్రకటించలేదు. దానితో ఈ సినిమా టైటిల్ పై మాత్రమే కాకుండా ఈ మూవీ విడుదలపై కూడా అనేక వార్తలు వస్తున్నాయి. కాకపోతే చాలా రోజుల నుండి కూడా ఈ మూవీ ని డిసెంబర్ నెలలోనే విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు మాత్రం ఎక్కువ వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సంబంధించిన అన్ని పనులను డిసెంబర్ నెల వరకు పూర్తి చేసి ఈ మూవీ ని డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తుంది.

ఇకపోతే కొంత కాలం క్రితం బాలకృష్ణ హీరో గా రూపొందిన అఖండ మూవీ ని కూడా డిసెంబర్ నెలలో విడుదల చేశారు. ఆ మూవీ కంటే ముందు వరుస అపజాయలతో ఉన్న బాలకృష్ణ ఈ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇక బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న NBK 109 మూవీ ని కూడా డిసెంబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

nbk

సంబంధిత వార్తలు: