రకుల్ ఉంటే సీక్వెల్స్ పని ఇక అంతే.. ఇదిగో లిస్ట్..?

MADDIBOINA AJAY KUMAR
మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి రకుల్ ప్రీత్ సింగ్ కి సీక్వెల్ మూవీస్ అస్సలు కలిసి రావడం లేదు. ఈమె నటించిన సీక్వెల్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వస్తున్నాయి. అలా రకుల్ నటించిన ఏ సీక్వెల్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకున్నాయో తెలుసుకుందాం. మాస్ మహారాజా రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కిక్ మూవీ రూపొంది అద్భుతమైన విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి కొనసాగింపుగా రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి "కిక్ 2" మూవీ ని రూపొందించాడు.

ఇందులో రకుల్ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా భాస్కర్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం మన్మధుడు అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన చాలా సంవత్సరాల తర్వాత మన్మధుడు 2 అనే మూవీ ని రూపొందించారు. ఇందులో నాగార్జున హీరోగా నటించగా రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 

రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఇకపోతే కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ మూవీ అద్భుతమైన విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి కొనసాగింపుగా కమల్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 అనే మూవీ రూపొందింది. ఇందులో రకుల్ కీలకమైన పాత్రలో నటించింది. జూలై 12 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. ఈ మూవీ కూడా భారీ అపజయాన్ని అందుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: