డైవర్స్ కి అదే కారణం అంటున్న హీరోయిన్..!

shami
విజయ్ సేతుపతి త్రిష జంటగా నటించిన 96 సినిమాలో వర్ష బొల్లమ్మ చిన్న పాత్రలో అలరించింది. ఆ సినిమా తెలుగు రీమేక్ జానులో కూడా ఆ పాత్ర ఆమెతోనె చేయించారు. అలా తెలుగు తెరకు పరిచయమైన వర్ష తెలుగులో హీరోయిన్ గా ఛాన్సులు అందుకుంటుంది. యువ హీరోలతో జత కడుతూ అలరిస్తున్న వర్ష బొల్లమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో వర్ష బొల్లమ్మ డైవర్స్ గురించి ఒక సెన్సేషనల్ కామెంట్ పెట్టింది.
అదేంటి అమ్మడికి ఎప్పుడు పెళ్లైంది.. అప్పుడే డైవర్స్ గురించి మాట్లాడుతుంది అనుకోవచ్చు. ఇక్కడ డైవర్స్ మీద తన ఒపీనియన్ మాత్రమే షేర్ చేసుకుంది వర్ష. అన్ లైన్ యాక్టివిస్ట్ దీపిక నారాయణ్ భరధ్వాజ్ సోషల్ మీడియా లో మీ ఉద్దేశంలో డైవర్స్ టుడే కి బిగ్గెస్ట్ రీజన్ ఏంటని అడిగింది. దానికి చాలామంది రకరకాల ఆన్సర్స్ ఇచ్చారు. కొందరు మెన్, ఉమెన్ మధ్య సఖ్యత లేకపోవడం, ఆర్ధిక ఇబ్బందులు, పేరెంటింగ్ చాలెంజెస్ ఇలా చాలా రకాల కారణాలు ఉన్నాయని పెట్టారు.
ఇదే ప్రశ్నకు వర్ష బొల్లమ్మ ఒక హ్యూమరిస్టిక్ ఆన్సర్ ఇచ్చింది. ఇంతకీ వర్ష ఏమన్నది అంటే. డైవర్స్ టుడే కి రీజన్ మ్యారేజ్ అని పెట్టింది. పెళ్లైతేనే ఇలాంటి సమస్య మొదలవుతుంది అన్నట్టుగా వర్ష ఆన్సర్ చేసింది. మరి పెళ్లిపై వర్షకు ఇలాంటి ఒపీనియన్ ఉందా. మ్యారేజ్ చేసుకుంటే కచ్చితంగా డైవర్స్ తీసుకుంటారా లాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక సీరియస్ ఇష్యూ మీద వర్ష చెప్పిన తన అభిప్రాయం మీద ఆన్ లైన్ లో ఆమె మీద ట్రోల్స్ వేస్తున్నారు. మరి వర్షకు అసలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదా ఏంటని అంటున్నారు. ఏది ఏమైనా ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కు పోయాను అన్నట్టుగా అయ్యింది అమ్మడి పరిస్థితి. ఈమధ్యనే సందీప్ కిషన్ తో భైరవ కోన సినిమాతో సక్సెస్ అందుకున్న అమ్మడు మరో రెండు సినిమాల్లో నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: