విక్రమ్ 'తంగలాన్' రిలీజ్ డేట్ ఫిక్స్..!!

murali krishna
తమిళ హీరో చియాన్ విక్రమ్  పేరు చెప్పగానే మనకు ఆయన పోషించిన విలక్షణమైన పాత్రలు గుర్తుకు వస్తాయి. ‘అపరిచితుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన విక్రమ్.. ఆ తరవాత ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో పలకరించారు. ఇప్పుడు వాటన్నింటినీ మించిపోయే పాత్రలో మెప్పించడానికి సిద్ధమైపోయారు.ఆ పాత్ర పేరు ‘తంగలాన్’ . ఇదే సినిమా టైటిల్ కూడా..చియాన్ విక్రమ్ దాదాపు మూడేళ్లుగా 'తంగలాన్' ప్రాజెక్టుతో కుస్తీ పడుతున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కబాలి, కాలా వంటి చిత్రాల తీసిన పా రంజిత్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.  సామాజిక నేపథ్యం, అనగారిన వర్గాల పోరాటాలు, తిరుగుబాట్ల నేపథ్యంతో సినిమాలు తీసే తమిళ దర్శకుడు పా రంజిత్.. ఈ ‘తంగలాన్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.పారంజిత్‌ డైరెక్షన్‌లో విక్రమ్ నటిస్తున్న మూవీ తంగలాన్‌. కేజీఎఫ్‌ అసలు కథను తెరపైకి తీసుకొస్తున్నామంటూ మేకర్స్ చెబుతున్న ఈ సినిమాపై పాన్ ఇండియా లెవల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ వాయిదా పడిన ఈ సినిమా రిలీజ్ డేట్‌ను శుక్రవారం (జులై 19) మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమా ఆగస్ట్‌ 15న రిలీజ్ కానుంది. అయితే అదే రోజు డబుల్ ఇస్మార్ట్, స్త్రీ2లాంటి పాన్ ఇండియా సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. దీంతో విక్రమ్ తంగలాన్‌కు ఆ సినిమాల నుంచి గట్టి పోటీ తప్పేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ కాగా.. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈ సినిమా విషయానికి వస్తే… తంగలాన్ చిత్రంలో  మాళవికా మోహనన్‌, పార్వతి తిరువొత్తు ఫీ మేల్‌ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా.. పశుపతి, డానియెల్‌ కల్టగిరోన్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (కేజీఎఫ్‌)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్‌ రాజా తెరకెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: