బాలయ్య వివాహానికి హాజరు కానీ ఎన్టీఆర్.. కారణం అదేనా..?

murali krishna
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన ఒక లెజెండ్.ఎన్నో చిత్రాలలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు.విలక్షణమైన నటనతో ఎంతగానో మెప్పించిన ఎన్టీఆర్  తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ప్రజల మన్ననలు పొందారు.. ఎన్టీఆర్ నటుడిగానే  కాకుండా నాయకుడిగా కూడా అద్భుతంగా రాణించారు.ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకు ఎనలేని సేవలందించారు. నందమూరి ఫ్యామిలీకి తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకముగా చెప్పాల్సిన పని లేదు.ఎన్టీఆర్,బసవతారకం దంపతులకు 13 మంది పిల్లలు .వారిలో హరికృష్ణ ,బాలకృష్ణ లు మాత్రమే తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో వీరిద్దరూ నటులుగా రాణించి అన్న ఎన్టీఆర్ పేరు నిలబెట్టారు. ప్రస్తుతం బాలయ్య  ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.
ఇదిలా ఉంటే ఇక ఇదిలా ఉంటే బాలకృష్ణ పెళ్లికి సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ ఇద్దరు కూడా హాజరు కాలేదనే వార్త అప్పట్లో తెగ వైరల్ అయింది.  తన సొంత కొడుకు పెళ్లికి ఎన్టీఆర్ ఎందుకు రాలేకపోయాడు అనేది కూడా ప్రతి ఒక్కరిలో సందేహాన్ని కలిగించింది.అయితే బాలకృష్ణ తన సోదరుడు అయిన రామకృష్ణ ఇద్దరు కూడా ఒకే రోజు పెళ్లి చేసుకున్నారు. ఇక వీళ్లిద్దరి పెళ్లి 1982 డిసెంబర్ 8 వ తేదీన జరిగింది. ఇక అప్పుడే కొత్తగా టిడిపి పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, హరికృష్ణ ఇద్దరూ ప్రచార యాత్రలో చాలా బిజీగా ఉన్నారు. అందువల్ల ఎన్టీయార్, హరికృష్ణ ఇద్దరు కూడా బాలకృష్ణ పెళ్లికి రాలేకపోయారు. నిజానికి బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్ వెళితే ఇక్కడ ప్రజలను కలిసే అవకాశం మళ్ళీ రాదనే ఉద్దేశ్యంతో ఆయన పెళ్లికి వెళ్లకుండా ప్రజల కోసమే అక్కడ ఆ కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడినుంచే తన బ్లెస్సింగ్స్ ని బాలకృష్ణ దంపతులకు, రామకృష్ణ దంపతులకు పంపించారు.పెళ్లి పూర్తి అయినా తరువాత వారు నేరుగా ఎన్టీఆర్ వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: