దేవర కోసం సరికొత్త టెక్నాలజీ.. కొరటాల ప్లాన్ అదిరిందిగా..!!

murali krishna
ప్రస్తుతం తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాస్ లో దేవర ఒకటి. ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. కొరటాల శివకు ఈ సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం. వరుసగా నాలుగు హిట్ సినిమాలు చేసిన తర్వాత ఆచార్య సినిమాతో డిజాస్టర్ చవి చూశాడు కొరటాల. అప్పటివరకు సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కొరటాలను అక్కడి నుంచి చాలామంది ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య వచ్చిన ఆచార్య సినిమా ఊహించని డిజాస్టర్ ను సొంతం చేసుకుంది.ఇక ఇదిలా ఉంటే కొరటాల శివ ఈ సినిమాని చాలా రిచ్ గా తెరకెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అందుకోసమే ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎక్కడ ఏ మిస్టేక్ లేకుండా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో గ్రాఫిక్స్ పార్ట్ చాలా కీలక పాత్రను పోషించబోతుందట.ఇక దానికోసం ఒక సరికొత్త టెక్నాలజీని కూడా కొరటాల శివ వాడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే హాలీవుడ్ కి చెందిన కొంత మంది ఎక్స్ పర్ట్ చేత ఆ టెక్నాలజీని ఇండియాకు తీసుకొచ్చి మరీ వాడుతున్నారట. ఇక దీని ద్వారా కొత్త టెక్నాలజీని కూడా జనానికి పరిచయం చేయబోతున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది… ఇక మొత్తానికైతే కొరటాల శివ ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఎవరైతే తనని విమర్శించారో వాళ్ల చేతే సుభాష్ అనిపించుకోవాలని చూస్తున్నాడు.
ఇక ఇదిలా ఉంటే కొరటాల శివ దేవర సినిమాతో తీసుకొస్తున్న టెక్నాలజీ ఏంటి అనే విషయాన్ని మాత్రం సినిమా యూనిట్ బయటికి తెలియజేయడం లేదు అది సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి అంటూ ఒక సస్పెన్స్ ను అయితే క్రియేట్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమాతో ఆయన తను అనుకున్న సక్సెస్ ని సాధిస్తాడా అలాగే తను తీసుకొచ్చిన టెక్నాలజీ మన సినిమాల విషయంలో వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…ట్రిపుల్ ఆర్‌లో ఎన్టీఆర్‌ను ఈ రేంజ్‌లో చూసాక.. నెక్ట్స్ ఎలా చూసినా కాస్త తక్కువే అనిపిస్తుంది. కానీ ఈ లోటు కనిపించకుండా చేస్తానంటున్నారు కొరటాల. మీరెంతైనా ఊహించుకోండి.. దానికి ఓ మెట్టు పైనే ఉంటుంది దేవర అంటూ మాటిస్తున్నారీయన. ఈ మధ్య ఎక్కడికి వచ్చినా.. తారక్ కూడా ఇదే మాట చెప్తున్నారు. కాలర్ ఎగరేద్దాం అంటున్నారు యంగ్ టైగర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: