ఆ సీన్ కోసం 26 టెక్స్ తీసుకున్న సూర్య.. మరి ఆ సీన్ ఏంటో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో సుధా కొంగర ఒకరు. ఇప్పటి వరకు ఈమె చాలా సినిమాలకు దర్శకత్వం వహించింది. అందులో సూర్య హీరోగా రూపొందిన సూరారై పోట్రు సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఈమెకు అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ సినిమా తెలుగులో ఆకాశమే నీ హద్దురా అనే పేరుతో విడుదల అయింది. ఈ మూవీ థియేటర్లలో కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లో నేరుగా విడుదల అయింది. ఒకే రోజు ఈ సినిమా తమిళ్ , తెలుగు భాషల్లో ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల కాగా ఈ మూవీ కి రెండు భాషల ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

ఇకపోతే తాజాగా సుధా కొంగర తమిళ , తెలుగు ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్న సూరారై పోట్రు సినిమాను సర్ఫ్ రా అనే మూవీ పేరుతో హిందీ లో అక్షయ్ కుమార్ హీరోగా రూపొందించింది. ఈ మూవీ జూలై 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు అద్భుతమైన టాక్ వచ్చింది. కాకపోతే ఈ సినిమాకు భారీ మొత్తంలో కలక్షన్లు మాత్రం రావడం లేదు. మరి ఈ సినిమా చివరగా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇకపోతే తాజాగా సుధా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

అందులో భాగంగా సూర్య ఓ సన్నివేశం చేయడానికి 26 టెక్ లు తీసుకున్న విషయాన్ని చెప్పుకొచ్చింది. అసలు విషయంలోకి వెళితే ... తాజాగా సుధ మాట్లాడుతూ ... నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయంలో సూర్య హీరోగా నటిస్తున్న ఓ మూవీ లో ఆయన ఒక షాట్ చేయడానికి 26 టేకులు తీసుకున్నాడు. ఒకానొక సమయంలో మణి సార్ టేక్ ఓకే అని చెప్పారు. కానీ సూర్య మాత్రం వినలేదు. పర్ఫెక్ట్ గా వచ్చే వరకు చేస్తాను అని చేస్తూనే ఉన్నారు. ఏ సన్నివేశం అయిన తన బెస్ట్ ఇవ్వాలని సూర్య చూస్తారు. ఎక్కడ కూడా ఆయన అస్సలు కాంప్రమైస్ కారు అని సుధ తాజాగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: