33 ఏళ్ల "ఆదిత్య 369" కి మొదట అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
నందమూరి బాలకృష్ణ నటించిన అద్భుతమైన బ్లాక్ బాస్టర్ సినిమాలలో ఆదిత్య 369 మూవీ ఒకటి. మోహిని ఈ సినిమాలో బాలకృష్ణ కు జోడిగా నటించగా ... సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ 1991 జులై 18 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇక ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ రాకపోవడం మొదలు అయింది. ఇక ఈ మూవీ లో ఒక వ్యక్తి టైమ్ మిషన్ లో తయారు చేస్తాడు.

అందులోకి అనుకోకుండా బాలకృష్ణ , హీరోయిన్ వెళతారు. ఇక ఆ టైమ్ మిషన్ లోకి బాలకృష్ణ , హీరోయిన్ మోహిని అనేక కాలాలలోకి వెళుతూ ఉంటారు. అందులో భాగంగా శ్రీకృష్ణదేవరాయలు కాలంకు కూడా వెళతారు. అక్కడ శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో బాలకృష్ణ నటించిన ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో 33 సంవత్సరాలు పూర్తీ అయింది.

33 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వివరాలను తెలుసుకుందాం. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా కథ మొత్తం రెడీ అయ్యాక ఈ మూవీ కి ఆదిత్య 369 అనే టైటిల్ ను కాకుండా మరో టైటిల్ కూడా అనుకున్నారట. ఈ మూవీ కి మొదట కాలయంత్రం అనే టైటిల్ ను అనుకున్నట్లు , కానీ అది కాకుండా మరో టైటిల్ ను పెడదాం అని కొన్ని రోజులు ఆలోచించగా ఆదిత్య 369 అనే టైటిల్ ను మూవీ బృందం వారు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: