గ్లోబల్ స్టార్ రెడీ అంటే మొదలు పెట్టేస్తా అంటున్న కృష్ణవంశీ..!!

murali krishna
టాలీవుడ్ దర్శకుల్లో కృష్ణవంశీది భిన్నమైన శైలి. ప్రతి చిత్రంలోనూ తనదైన స్టైల్తో ఆయన తన కెరీర్ ప్రారంభంలో ప్రేక్షకులనే కాదు... సినీ పరిశ్రమలోని టాప్ హీరోల దృష్టిని కూడా ఆకర్షించాడు. దీంతో ఆయనకు టాలీవుడ్లో క్రియేటివ్ డైరెక్టర్గా మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయి. ఆయన చిత్రాలలో నటించడానికి స్టార్ హీరోలు కూడా వెయిట్ చేశారు.కృష్ణవంశీ చిత్రాలకు ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. ఆయన చిత్రం వస్తుందంటే ఇంటిల్లిపాది ఎదురుచూసేలా ఉండేది. కానీ గత కొన్నేళ్లుగా ఆయన్నుంచి సరైన సినిమా రాలేదు. రంగమార్తాండ అనే సినిమా వచ్చింది. అందరి మనసుల్ని హత్తుకుంది. కానీ కమర్షియల్‌గా అంత వర్కౌట్ కాలేదని అంటుంటారు. ఇప్పుడు కృష్ణ వంశీ తన అప్ కమింగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడని అర్ఱం అవుతోంది.ఆయన తెరకెక్కించిన చిత్రాలన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. గులాబీ, సింధూరం, అంతఃపురం, మురారి, ఖడ్గం, రాఖీ, చందమామ, మహాత్మ, రంగమార్తండా.. ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. అందమైన కుటుంబకథా చిత్రాలను తెరకెక్కించి.. అలాగే తన సినిమాల్లోని పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే విధంగా అద్భుతంగా డిజైన్ చేయడంలో ఆయనకు సాటి మరెవరు లేరు. డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రాల్లో మురారీ ఒకటి. ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‏లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ సినిమా 2001లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

అప్పట్లో ఈ సినిమాకు ప్రత్యేకమైన అభిమానులు ఉండేవారు. ఈ చిత్రంలో మహేష్ సరసన సోనాలి బింద్రే నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు.
అయితే ఈ క్రమంలో మురారి దర్శకుడు కృష్ణ వంశీ రంగంలోకి దిగాడు.మహేష్ బాబు అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వచ్చాడు. అందులో భాగంగా ఓ నెటిజన్ రామ్ చరణ్ మూవీ గురించి అడిగాడు. రామ్ చరణ్‌కు ఓ సినిమా బాకీ ఉన్నారు.. మంచి మెమోరబుల్ సినిమా ఇవ్వాలని అన్నారు.. గుర్తుందా అని ఓ నెటిజన్ గుర్తు చేశాడు. దానికి కృష్ణ వంశీ చక్కని సమాధానం ఇచ్చాడు.నాకు గుర్తుంది సర్.. నేను ఆల్రెడీ రెడీగానే ఉన్నాను.. సూపర్ ఐడియా ఉంది.. స్క్రిప్ట్ కూడా రెడీగానే ఉంది.. రామ్ చరణ్ గారు టైం ఇవ్వడమే ఆలస్యం అన్నట్టుగా కృష్ణవంశీ రియాక్ట్ అయ్యాడు. మరి చరణ్ ఉన్న బిజీలో.. చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టుల మధ్యలో కృష్ణవంశీకి టైం ఇస్తాడో లేదో పక్కన పెడితే.. అభిమానులు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. వద్దు సార్ అంటూ కొందరు దండం పెడుతుంటే.. సినిమా పోయినా పర్లేదు అన్నా మరోసారి కృష్ణవంశీకి ఛాన్స్ ఇవ్వు అంటూ ఇంకొందరు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: